Monday, December 23, 2024

పోలీసులపై కత్తులతో దాడిచేసిన క్రిమినల్స్: ముగ్గురికి గాయాలు

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం: కేరళలోని ఇదుక్కి జిల్లాలో సోమవారం కొందరు క్రిమినల్స్ జరిపిన దాడిలో పోలీసు బృందం తీవ్రంగా గాయపడింది. ఈ దాడిలో ముగ్గురు పోలీసు అధికారులు గాయపడ్డారు.

రెండు క్రిమినల్ కేసులలో నిందితులుగా ఉన్న కొందరు క్రిమినల్స్‌ను అదుపులోకి తీసుకునేందుకు పోలీసు అధికారులతో కూడిన బృందం ఇదుక్కి జిల్లాలోని చిన్నకనాల్ ప్రాంతానికి చేరుకుంది. అళప్పుళా జిల్లాలోని కయంకుళం నుంచి ఐదుగురు సభ్యులతోకూడిన పోలీసు బృందం సోమవారం తెల్లవారుజామున చెన్నికనాల్ చేరుకున్నట్లు ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఈ కేసులకు సంబంధించి నలుగురు వ్యక్తులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.

సెల్ టవర్ల ఆధారంగా నిందితులు తలదాచుకున్న ప్రదేశాన్ని పోలీసులు గుర్తించి దాడి జరిపారు. నేరస్థులను పట్టుకోవడానికి ప్రయత్నించగా ఒక పోలీసు అధికారి కత్తిపోట్లకు గురయ్యారు. ఆయనను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందచేశారు. ఆయన పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. ఈ దాడిలో మరో ఇద్దరు పోలీసు అధికారులు కూడా గాయపడ్డారు. దాడి చేసి పారిపోయిన మిగిలిన ముఠా సభ్యుల కోసం పోలీసులు గాలింపు జరుపుతున్నట్లు ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News