Thursday, January 23, 2025

నా భార్య కోపంగా ఉంది….. 10 రోజుల లీవ్ కావాలి (వైరల్ లీవ్ లెటర్)

- Advertisement -
- Advertisement -

 

న్యూస్‌డెస్క్: సాధారణంగా ఎంట్లో బాగాలేదనో, కుటుంబంతో విహార యాత్రకు వెళ్లాలనో కారణంతో ఎవరైనా ఉద్యోగి సెలువు తీసుకుంటుంటారు. అయితే..ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన ఒక పోలీసు ఇన్‌స్పెక్టర్ మాత్రం పైఅధికారులకు పెట్టుకున్న లీవు దరఖాస్తు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన భార్య కోపంగా ఉందని, ఆమెను శాంతిపచేయడానికి తనకు 10 రోఉలు సెలవు కావాలంటూ ఆ ఇన్‌స్పెక్టర్ పెట్టుకున్న లీవు దరఖాస్తు పై అధికారులను సైతం నవ్వుల్లో ముంచెత్తించింది.

హోలీ పండుగ కోసం తనకు 10 రోజలు సెలవు కావాలని కోరుతూ ఫరూఖా జిల్లాకు చెందిన పోలీసు ఇన్‌స్పెక్టర్ అశోక్ కుమార్ జిల్లా ఎస్‌పికి లీవు లెటర్ పంపించారు. తన పుట్టింటి వారితో హోలీ పండుగను జరుపుకుని 22 ఏళ్లు అయిందని తన భార్య తనపై చాలా కోపంగా ఉందని, ఆమెతో కలసి ఆమె పుట్టింటికి వెళ్లడానికి తనకు 10 రోజులు సెలవు కావాలని అశోక్ కుమార్ ఎంతో నిజాయితీగా తన లేఖలో రాశారు. సెలవు కోసం దొంగ కారణాలు చెప్పకుండా నిజాయితీగా తన బాధను వ్యక్తం చేసిన ఆ ఇన్ స్పెక్టర్ కు ఐదు రోజుల సెలవును ఎస్ పి మంజూరు చెసినట్టుగా తెలుస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News