Thursday, January 23, 2025

కొత్త సంవత్సరం దావత్ కోసం మేకను దొంగలించిన పోలీసులు

- Advertisement -
- Advertisement -

 

Police theft Goat in Odisha

భువనేశ్వరి: కొత్త సంవత్సరం దావత్ కోసం పోలీసులు మేకను దొంగలించిన సంఘటన ఒడిశాలోని బొలంగీర్ జిల్లా సింధికెల గ్రామంలో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. సంకీర్తన గురు అనే వ్యక్తి మేకలను మేపుతూ జీవనం సాగిస్తున్నాడు. రెండు మేకలు కనిపించకపోవడంతో ఇరుగుపొరుగు రైతులను అడిగారు. కొందరు రైతులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు తీసుకెళ్లారని తెలుసుకున్నాడు. వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్లేసరికి మేకలను కోస్తుండగా అక్కడికి వెళ్లాడు. అవి తన మేకలని ఇవ్వాలని పోలీసులను బతిమాలాడు. పోలీసులు అతడి మాటాలు పట్టించుకోకుండా బెదిరించారు. దీంతొ ఎస్ పికి అతడు ఫిర్యాదు చేశాడు. ఎస్ పి విచారన చేసి ఎఎస్ఐ సుమన్ మల్లిక్ ను సస్పెండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News