Monday, December 23, 2024

మహిళపై థర్డ్ డిగ్రీ.. ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెండ్

- Advertisement -
- Advertisement -

సిటీబ్యూరో: స్వాతంత్య్ర దినోత్సవం రోజునే పోలీసులు ఓ మహిళను అదుపులోకి తీసుకుని చిత్రహింసలకు గురిచేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అకారణంగా మహిళను అదుపులోకి తీసుకోవడంతో సదరు మహిళ ఎదురు తిరగటంతో ఆమెపై ఎల్‌బినగర్ పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. దీంతో బాధితురాలు తీవ్రంగా గాయపడి ప్రస్తుతం నడవలేని స్థితిలో ఉంది. స్థానికుల వివరాల ప్రకారం… వరలక్ష్మిమీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నందిహిల్స్ కాలనీ, రోడ్డు నంబర్ 4లో ఉంటోంది. తన కూతురు వివాహం నిశ్చయం కావడంతో ఆగస్టు, 15వ తేదీ రాత్రి సరూర్‌నగర్‌లోని బంధువుల వద్ద డబ్బులు తీసుకునేందుకు వెళ్లింది. తిరిగి వస్తుండగా ఎల్‌బినగర్ సర్కిల్‌లో వరలక్ష్మిని ఎల్‌బినగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనను ఎందుకు అదుపులోకి తీసుకుంటున్నారని వరలక్ష్మిపోలీసులను ప్రశ్నించింది.

దీంతో మరింత రెచ్చిపోయిన పోలీసులు ఆమెను జీప్‌లో ఎక్కించుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పిఎస్‌కు వెళ్లిన తర్వాత మహిళపై ఇద్దరు కానిస్టేబుళ్లు థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. దీంతో బాధిత మహిళ తీవ్రంగా గాయపడింది. ఈ విషయం పోలీస్ ఉన్నతాధికారికి తెలియడంతో మహిళను 16వ తేదీ ఉదయం వదిలేశారు.పోలీసులు విచక్షణారహితంగా కొట్టడంతో మహిళ నడవలేనిస్థితికి చేరుకుంది. అకారణంగా తనను పోలీసులు తనను కొట్టారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. మహిళను తీవ్రంగా కొట్టడంతో ఆమె బంధువులు ఎల్‌బినగర్ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు, దీంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. మహిళ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై పలువురు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇద్దరు కానిస్టేబుళ్ల సస్పెండ్
మహిళపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ ఆదేశాలు జారీ చేశారు. మహిళపై దాడి చేసిన విషయం తెలియగానే రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ విచారణ చేసి నివేదక సమర్పించాలని ఎల్‌బి నగర్ డిసిపిని సాయిశ్రీని ఆదేశించారు. విచారణ చేసిన డిసిపి నివేదికను సిపికి సమర్పించారు. దానిని పరిశీలించిన సిపి డిఎస్ చౌహాన్ హెడ్‌కానిస్టేబుల్ శివశంకర్, మహిళా కానిస్టేబుల్ సుమలతను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News