- Advertisement -
హైదారాబాద్ ః సంక్రాంతి లక్కీ డ్రా వ్యవహారంలో ఎపి మంత్రి అంబటి రాంబాబుపై సత్తెనపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. కోర్టు ఆదేశాల మేరకు ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రైజ్ చిట్స్ అండ్ మనీ సర్కులేషన్ స్కీమ్స్ నిషేద చట్టం కింద మంత్రి అంబటిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మంత్రి అంబటి నేతృత్వంలో సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో సత్తెనపల్లిలో వైసీపీ నేతలు టికెట్లు అమ్ముతున్నారని జనసేన పార్టీ నేతలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో గుంటూరు కోర్టులో జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వర రావు పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయమై మంత్రి అంబటిపై కేసు నమోదు చేసి, విచారణ జరపాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. దీంతో మ్ంరత్రి అంబటిపై కేసును పోలీసులు నమోదు చేశారు.
- Advertisement -