Wednesday, January 22, 2025

జగిత్యాలలో అక్కను చంపిన చెల్లి… సహకరించిన తల్లి

- Advertisement -
- Advertisement -

కోరుట్ల: జగిత్యాల జిల్లా కోరుట్లలో 24 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దీప్తి అనుమానాస్పద మృతి కేసులో హత్యగా పోలీసులు నిర్ధారించారు. దీప్తి చెల్లెలు చందన, ఆమె స్నేహితుడితో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వివాదాల నేపథ్యంలో తన ప్రియుడి సహకారంతో తన సోదరిని హత్య చేసినట్లు చందన అంగీకరించినట్లు పోలీసు దర్యాప్తులో తేలింది. తాను ప్రేమించిన వాడు ఇతర మతస్థుడు కావడంతో అక్క దీప్తి ఒప్పుకోలేదని ముక్కు, మూతికి ప్లాస్టర్ వేసి చందన దారుణంగా హత్య చేసింది. హత్యకు చందన ప్రియుడు, అతడి తల్లి సహకరించించినట్లు సమాచారం. స్థానిక పోలీసులు, ఒంగోలులోని వారి సహచరుల సహకారంతో చందన, ఆమె స్నేహితురాలు, డ్రైవర్‌ను పట్టుకున్నారు. జగిత్యాలలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దీప్తి హత్య ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News