Saturday, November 23, 2024

ఎన్డిపిఎస్ యాక్ట్‌పై పోలీసులకు శిక్షణ

- Advertisement -
- Advertisement -

ఎన్డిపిఎస్ యాక్ట్‌పై పోలీసులకు శిక్షణ
హాజరైన సైబరాబాద్ పోలీసులు
Police training on NDPS Act

మనతెలంగాణ, సిటిబ్యూరో:  ఎన్‌డిపిఎస్ యాక్ట్‌పై శిక్షణ పోలీసులకు దర్యాప్తులో చాలా ఉపయోగపడుతుందని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర అన్నారు. ఎన్‌డిపిఎస్ యాక్ట్‌పై గచ్చిబౌలిలో సోమవారం ఏర్పాటు చేసిన శిక్షణలో పలువురు విచారణ అధికారులు, పిఎస్‌ల రైటర్లు పాల్గొన్నారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలీజెన్స్ అధికారి రఘునందన్ ఎన్‌డిపిఎస్ యాక్ట్ గురించి అవగాహన కల్పించారు. చాలా పోలీస్ స్టేషన్ సిబ్బంది శిక్షణ ఆన్‌లైన్‌లో వినేందుకు లింక్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషర్ స్టిఫెన్ రవీంద్ర మాట్లాడుతూ శిక్షణ వల్ల విచారణ అధికారులు కేసును సమర్థవంతంగా దర్యాప్తు చేసి నిందితులకు శిక్ష పడేలా చేస్తారని తెలిపారు. శిక్షణలో గంజాయి పట్టుకోవడం, సీజ్, శాంపిలింగ్, ఇన్‌వెంటరీ ఎలా ప్రిపేర్ చేయాలి, ఫొటోగ్రఫీ, నోటీసులు ఎలా పంపించాలి తదితరాల గురించి వివరించారు. సమావేశంలో క్రైం డిసిపి రోహిణి ప్రియదర్శిని, లీగల్ అడ్వైజర్ బాలబుచ్చయ్య, రేవా రెడ్డి, ఎన్‌డిపిఎస్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సెల్, సిటిసి అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News