Wednesday, January 22, 2025

కేరళలో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలపై వాటర్ కెనాన్ ప్రయోగం

- Advertisement -
- Advertisement -

Kerala Police

త్రిస్సూర్:  ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఇక్కడి అతిథి గృహానికి  చేరుకున్న తరుణంలో యువజన కాంగ్రెస్‌ కార్యకర్తలు రామనిలయం ఎదుట హంగామా చేయడంతో శనివారం రాత్రి టెన్షన్‌ వాతావరణం నెలకొంది. ముఖ్యమంత్రి శనివారం రాత్రి రామనిలయంలో బస చేసి, ఆదివారం ఉదయం సెంట్రల్ జైలు ప్రారంభోత్సవానికి మలప్పురం వెళ్లనున్నారు.

రామనిలయం వైపు టార్చిలైట్‌తో ర్యాలీగా బయలుదేరిన యువజన కాంగ్రెస్ కార్యకర్తలను కేరళ సాహిత్య అకాడమీ సమీపంలో పోలీసులు అడ్డుకున్నారు. యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు బారికేడ్లను తోసుకుంటూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించగా వాటర్ కెనాన్లు ప్రయోగించారు. కాగా ఆందోళనకారులు ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు.

బంగారం స్మగ్లింగ్ కేసులో ముఖ్యమంత్రి పినరయి విజయన్ రాజీనామా చేయాలని యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News