Monday, December 23, 2024

పోలీస్ వాహనం బోల్తా

- Advertisement -
- Advertisement -

మోత్కూరు: మోత్కూరు పోలీస్ వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. నార్కట్‌పల్లి మండలం బాజకుంట సమీపంలో బైక్ ను తప్పించబోయి అదుపు తప్పి వాహనం పల్టీ కొట్టడంతో కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే… మోత్కూరు ఎస్‌ఐ వి.జానకిరాంరెడ్డి గురువారం కోర్టు పనిపై నల్లగొండకు వెళ్లేందుకు డ్రైవర్ గా కానిస్టేబుల్ ముత్తయ్యను తీసుకుని బొలెరో వాహనంలో వెళ్లారు.

నార్కట్ పల్లికి వెళ్లే సరికి ఎస్‌ఐ కారు రావడంతో ఆయన్ను నార్కట్ పల్లిలో దింపి తిరిగి మోత్కూరు వస్తుండగా నార్కట్‌పల్లి మండలం పల్లెపహాడ్ వద్ద ముందు వెళుతున్న బైక్ ను తప్పించబోయి కానిస్టేబుల్ ముత్తయ్య ఒక్కసారిగా సడెన్ బ్రేక్ వేయడంతో వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కకు పల్టీ కొట్టింది. ప్రమాదంలో కానిస్టేబుల్ ముత్తయ్య స్వల్ప గాయాలతో బయటపడగా ఆయన్ను చికిత్స కోసం మోత్కూరులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News