- Advertisement -
స్క్రాచ్ చేశారంటే అంతే
హెచ్చరించిన నగర సైబర్ క్రైం పోలీసులు
హైదరాబాద్: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఆసరాగా చేసుకుని సైబర్ నేరస్థులు క్యాష్‌బ్యాక్ ఆఫర్‌తో ఛీటింగ్ చేస్తున్నారు. సైబర్ నేరాలపై హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు నగర ప్రజలను హెచ్చరించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వివిధ ఫోన్ నంబర్లు, ఇంటర్నెట్ మేసేజింగ్ అప్లికేషన్స్ నుంచి చాలామంది తమ పేటిఎం, గూగుల్ పే లేదా ఫోన్ పే యాప్‌లలో క్యాష్ బ్యాక్‌ను భరోసా ఇచ్చే సందేశాన్ని ఓపెన్ చేసి వారు పంపించిన లింక్‌ను ఓపెన్ చేస్తే చాలు బాధితుడి బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు డ్రా అవుతున్నాయి. మీరు రూ.1971,1857,1947 గెలిచారని తేదీలతో సందేశాల లింక్‌ను సైబర్ నేరస్థులు పంపుతున్నారు. ప్రజలు లింక్‌పై క్లిక్ చేస్తే డబ్బులు మాయం అవుతున్నాయని నగర సైబర్ క్రైం ఎస్సై మల్లేష్ తెలిపారు.
- Advertisement -