- Advertisement -
హైదరాబాద్: జమ్ముకాశ్మీర్ లోని పహల్గామ్ ఉగ్రదాడిలో 28 మంది పర్యాటకులు మరణించడంతో భారత ఆర్మీ ఉగ్రవాదుల కోసం జల్లెడ పడుతున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. భారత్ నుంచి పాకిస్థానీయులు వెళ్లిపోవాలని ఆదేశించారు. దీంతో అన్ని రాష్ట్రాల్లో ఉన్న పాకిస్థానీయులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో హైదరాబాద్ లో 213 మంది పాకిస్తానీయులు ఉన్నట్టు గుర్తించినట్లు తెలుస్తోంది. నగరంలో ఉంటున్న నలుగురు పాకిస్తానీయులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. రేపటిలోగా హైదరాబాద్ విడిచి వెళ్లిపోవాలని పోలీసులు హెచ్చరించారు.
- Advertisement -