Wednesday, January 22, 2025

సచివాలయానికి పోలీసు భార్యల నిరసనసెగ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సిటీ బ్యూరో : బెటాలియన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుళ్లతో వెట్టి చాకిరి చేయిస్తున్నారని వారి కుటుంబ సభ్యులు సెక్రటేరియట్ ఎదుట శుక్రవారం ఆందోళన చేశారు. బెటాలియన్ కానిస్టేబుళ్ల దుర్భర పరిస్థితిపై వారి కుటుంబసభ్యులు చేస్తున్న ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. ఇప్పటి వరకు బెటాలియన్ ఎదుట ధర్నా చేసిన కానిస్టేబుళ్ల భార్య లు శుక్రవారం రాష్ట్ర సచివాలయం ఎదుట నిరసన తె లిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి బెటాలియన్ కానిస్టేబుళ్ల భార్యలు, కుటుంబసభ్యులు ఉద యం పెద్ద ఎత్తున హైదరాబాద్ చేరుకుని సెక్రటేరియ ట్ వద్ద ఆందోళన చేపట్టారు.

తమ భర్తలను కూలీల కంటే హీనంగా చూస్తున్నారని వాళ్లతో వెట్టిచాకిరి చే యిస్తున్నారని మండిపడ్డారు. బెటాలియన్ కానిస్టేబు ళ్ల భార్యలు, కుటుంబసభ్యులు చేస్తున్న ఆందోళనల తో అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకునే ప్రయ త్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు, బెటాలియన్ కానిస్టేబుళ్ల కుటుంబసభ్యులకు మధ్య వాగ్వాదం నెలకొంది. దీంతో బెటాలియన్ కానిస్టేబుళ్ల కుటుంబసభ్యులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఎదురించిన బెటాలియన్ కానిస్టేబుళ్ల భార్యలను, ఇత ర కుటుంబసభ్యులను మహిళా కానిస్టేబుళ్లు కొట్టుకుంటూ మరీ వాహనాల్లో తరలించారు. దీంతో సచివాలయం ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News