Monday, December 23, 2024

మా ఊరి పోలిమేర 2 ట్రైలర్ విడుదల

- Advertisement -
- Advertisement -

మా వూరి పోలిమేర‘కు సీక్వెల్ గా రాబోతున్న చిత్రం మా వూరి పోలిమేర 2.   శ్రీకృష్ణ క్రియేష‌న్స్ బేన‌ర్ పై  గౌరు గ‌ణ‌బాబు స‌మ‌ర్ప‌ణ‌లో  గౌరికృష్ణ నిర్మాత‌గా  రూపొందుతున్న ఈ చిత్రానికి డా.అనిల్ విశ్వ‌నాథ్ ద‌ర్శ‌కుడు.  స‌త్యం రాజేష్‌, డా. కామాక్షి భాస్కర్ల, గెట‌ప్ శ్రీను, రాకెండ్ మౌళి, బాలాదిత్య, సాహితి దాస‌రి,  ర‌వి వ‌ర్మ‌, చిత్రం శ్రీను, అక్ష‌త శ్రీనివాస్‌ ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు.

చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణనంతర పనులను జరుపుకుంటోంది. ఈ చిత్రం నవంబరు 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్ లో విడుదలకు సిద్ధమైంది. అయితే ఈ చిత్రాన్ని చూసి  ఎంతగానో నచ్చిన ప్రముఖ పంపిణీదారుడు వంశీ నందిపాటి ఈ చిత్ర హక్కులను ఫ్యాన్సీ రేటుతో కొనుగోలు చేసి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.  కాగా ఈ చిత్రం ట్రైలర్ విడుదల కార్యక్రమం శనివారం  ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా విచ్చేసిన దర్శకుడు హరీష్ శంకర్, హీరో కార్తికేయ, నిర్మాత బన్నీవాస్ లు ఈ చిత్రం ట్రైలర్ ను విడుదల చేశారు. హరీష్ శంకర్ మాట్లాడుతూ  ఓటీటీలో పోలిమేర 1 బాగుందని చాలా మంది చెప్పారు.

చూడగానే నాకు కూడా బాగా నచ్చింది. కంటెంట్ చాలా బలంగా వుంది. పోలిమేర 2 కూడా అదే తరహాలో  బాగుంటుందని అనుకుంటున్నాను. బన్నీవాసుతో నాకు మంచి రిలేషన్ వుంది. ఆయన ఈ సినిమాకు సపోర్ట్ గా వుండి ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం దర్శకుడికి సినిమాలంటే ఎంత ఇష్టమో ఈ సినిమా ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. మంచి తెలుగు టైటిల్ తో వస్తున్న ఈ చిత్రం తప్పకుండా ఆడియన్స్ కు సరికొత్త అనుభూతినిస్తుందనే నమ్మకం వుంది. ఈ సినిమాతో ఇందులో పార్ట్ అయిన నటీనటులకు

సాంకేతిక నిపుణుల అందరికి మంచి పేరు వస్తుంది‘ అన్నారు. బన్నీవాస్ మాట్లాడుతూ ’నాకు నచ్చి నేను ఈ సినిమాకు  సపోర్ట్ చేస్తాను. వంశీ చేస్తున్న తొలి సినిమా ఇది. 2018 సినిమాను చూసి తెలుగులో మనం విడుదల చేద్దామని సజెస్ట్ చేసిన వంశీ ఈ సినిమాను విడుదల చేస్తున్నాడు. అతని జడ్జ్ మెంట్ పై నాకు నమ్మకం వుంది. ఇది చాలా చిన్న కథ తప్పకుండా అందిరికి నచ్చుతుందనే నమ్మకం వుంది. సత్యం రాజేష్ కు కెరీర్ కు  బాగా ప్లస్ అవుతుంది. పోలిమేర 3 కూడా వుంటుంది. మొదటి పార్ట్ చూడని వాళ్లకు కూడా పోలిమేర 2 అర్థమయ్యేటట్లు స్క్రీన్ ప్లే వుంటుంది. ఈ సినిమా అందరికి మంచి బ్రేక్ ఇవ్వాలని కోరుకుంటున్నాను.

పోలిమేర2 కు బాగా ఆడాలని కోరుకుంటున్నాను. హీరో కార్తీకేయ మాట్లాడుతూ ఇలాంటి సినిమాలు బిగ్ స్క్రీన్ పై చూస్తే చాలా మంచి అనుభూతికి లోనవుతారు. చాలా కష్టపడి చేసిన సినిమాలా అనిపిస్తుంది. తప్పకుండా సినిమా మంచి సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నాను అన్నారు.  వంశీ నందిపాటి మాట్లాడుతూ నాకు అండగా వుంటూ, ఈ రోజు నేను ఈ స్థాయిలో వున్నానంటే బన్నీవాస్ కారణం. సినిమాను తప్పకుండా అందరికి నచ్చుతుందని నమ్ముతున్నాను అని తెలిపారు. గౌరికష్ణ మాట్లాడుతూ ఇలాంటి చిన్న సినిమాలకు అండగా వుండే బన్నివాస్, వంశీ నందిపాటి గారికి అభినందనలు, సినిమా విజయంపై మంచి నమ్మకం  వుంది.

నిజాయితీగా దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు అన్నారు.  సత్యం రాజేష్ మాట్లాడుతూ  ఈ సినిమా వంశీ నందిపాటికి నచ్చడంతో ఈ సినిమా ప్రయాణం ఇక్కడి వరకు రావడం ఆనందంగా వుంది. అన్నారు. దర్శకుడు డా. అనిల్ విశ్వనాథ్ మాట్లాడుతూ హరీష్ శంకర్, కార్తికేయ, బన్నీవాస్ గారు ఈ వేడుకకు రావడం పాజిటివ్ గా  అనిపిస్తుంది పార్ట్ 1కు మించి పార్ట్ 2 వుండబోతుంది. వంశీ నందిపాటి సినిమాను విడుదల చేయడం ఎంతో ఆనందంగా వుంది. ఈ సినిమాను పార్ట్ 1కు 100 రెట్లు ఎంజాయ్ చేస్తారు.

బాలాదిత్య మాట్లాడుతూ నేను రాజేష్ సినీ పరిశ్రమకు వచ్చి 20 సంవత్సరాలైంది పోలిమేర చూసిన ప్రతి ఒక్కరూ పార్ట్ 2  ఎప్పుడూ అని అడిగారు. పార్ట్ 1కు మించి ఎన్నో రెట్లు అద్బుతంగా వుంటుంది. పార్ట్ 1ను చూడనివాళ్లు తప్పకుండా చూసి పార్ట్ 2కు వస్తే మీ మెదళ్లకు చాలా పని వుంటుంది. ప్రతి  సన్నివేశం ఎంతో అద్భుతంగా వుంటుంది. సినిమాలో చాలా సర్ ప్రైజ్ లు ఈ సినిమాలో వుంటాయి. సత్యం రాజేష్ ఈ సినిమాతో పర్ ఫార్మెర్ అని నిరూపించుకున్నాడు‘ అన్నారు. ఈ వేడుకలో  ఖుషేందర్, గెటప్ శీను, కామాకి, సాహితిగ్యానీ  తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News