ప్రధాన కూడళ్లలోఫ్లెక్సీలు, హోర్డింగులు
బిజెపి జాతీయ
కార్యవర్గ
సమావేశాలకు
సర్వం సిద్ధం
నేడు ప్రధాని రాక
రాష్ట్రపతి ఎన్నికల
ప్రచారానికి
యశ్వంత్‌సిన్హా
స్వాగతానికి
టిఆర్‌ఎస్
భారీ సన్నాహాలు
మన తెలంగాణ/హైదరాబాద్ : నేటి నుంచి రెండు రోజుల పాటు నగరంలో రాజకీయ పండుగ జరుగనుంది. దీని కోసం పోటాపోటీగా భారీ ఏర్పాట్లు చేశారు. దీంతో నగరంలోని ముఖ్యమైన కూడళ్లు.. ప్రధాన వీధులన్నీ వివిధ రాజకీయ పార్టీల ఫ్లెక్సీ లు.. నిండిపోయింది. ట్రాఫిక్ ఐలాండ్‌లన్నీ ఆయా పార్టీల జెండాలు, బంటింగ్స్‌తో దర్శనమిస్తున్నాయి. రాష్ట్రపతి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న య శ్వంత్ సిన్హాకు మద్దతుగా టిఆర్‌ఎస్, జాతీ య కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు వస్తున్న ప్రధాని నరేంద్రమోడీకి ఘన స్వాగతం పలుకుతూ బిజెపి నాయకులు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. ఈ రెండు కార్యక్రమాలను ఆ పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. వారు తలపెట్టిన కార్యక్రమాలను విజయవంతం చేయడం కోసం వారంరోజులుగా ఇరుపార్టీల నేతలు రాత్రింభవళ్లు శ్రమించారు. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పా ల్గొనేందుకు ప్రధాని నరేంద్రమోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాలకు చెందిన బిజెపి ముఖ్యమంత్రులు, పార్టీ అగ్రనేతలంతా ఒక్కరొక్కరుగా నగరానికి చేరుకుంటున్నారు. కాగా మోడీ శనివారం మధ్యాహ్నం 2.55 గంటలకు నగరానికి చేరుకోనున్నారు. ప్రత్యేక విమానంలో బేగంపేట్ ఎయిర్‌పోర్టుకు నరేంద్రమోడీ చేరుకుంటారు.
అక్కడి నుంచి హెలికాప్టర్‌లో జాతీయ కార్యవర్గాలు జరిగే హెచ్‌ఐసిసికి చేరుకుంటారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు బిజెపి భారీ ఏర్పాట్లు చేసింది. దీని కోసం వారం రోజులుగా పార్టీ నేతలంతా తీవ్రంగా శ్రమించారు. ఇందులో భాగంగా ఇప్పటికే పలు ప్రాంతాలను బిజెపి జెండాలతో నింపివేశారు. మోడీకి స్వాగతం పలుకుతూ భారీ కటౌట్లను ఏర్పాటు చేశారు. వాటికి ప్రకాశమంతమైన రంగురంగుల బల్పులను కూడా ఏర్పా టు చేశారు. ఫలితంగా రాత్రివేళల్లో మోడీ కటౌట్లన్నీ దగదగ వెలిగిపోతున్నాయి. ఇక నగర వీధులను, రహదారులకు ఇరవైపులా పార్టీ జెండాలను ఏర్పా టు చేశారు. ఇక విపక్షాల రాష్ట్రపతి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న యశ్వంత్ సిన్హా మరి కాసేపట్లోనే ప్రత్యేక విమానంలో బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు టిఆర్‌ఎస్ పార్టీ కూడా భారీ ఏర్పాట్లు చేసింది. ప్రధాన రహదారులను కూడా పూర్తిగా టిఆర్‌ఎస్ జెండాలతో నింపివేసింది. ముఖ్యమైన కూడళ్ల వద్ద సిన్హాకు స్వాగతం పలుకుతూ టిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కెసిఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఫోటోలతో కూడా భారీ కటౌట్లను ఏర్పాటు చేసింది.
అలాగే ట్రాఫిక్ ఐలాండ్‌లను కూ డా పార్టీ పతాకాలతో నింపివేసింది. దీంతో నగరంలో ఎక్కడ చూసినా బిజెపి, టిఆర్‌ఎస్ జెండా లు, పార్టీలకు చెంది నేతల కటౌట్లు దర్శనమిస్తున్నాయి. ఇదిలా ఉండగా సిన్హాకు టిఆర్‌ఎస్ ఎం పిలు, శాసనసభ్యులను పరిచేయడం చేయడం కో సం నెక్లస్‌రోడ్డులోని జలవిహార్‌లో సమావేశాన్ని ఏ ర్పాటు చేసింది. సిన్హాకు స్వయంగా ముఖ్యమంత్రి కెసిఆర్ బేగంపేట్ విమానాశ్రయానికి వెళ్లి స్వాగ తం పలకనున్నారు. అక్కడి నుంచి వారిద్దరూ జలవిహార్‌కు రానున్నారు. దీంతో బేగంపేట నుంచి మొదలకుని జలవిహార్ ప్రాంగణం వరకు ఎక్కడా చూసి న టిఆర్‌ఎస్ జెండాలు రెపరెపలాడుతున్నాయి.
ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు
యశ్వంత్ సిన్హాకు సిఎం కెసిఆర్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలుకుతామని మంత్రులు తలసాని, మ హమూద్‌అలీ, ఎంఎల్‌సి పల్లా రాజేశ్వర్‌రెడ్డిలు తెలిపారు. శుక్రవారం నెక్లెస్ రోడ్‌లోని జలవిహార్‌లో యశ్వంత్ సిన్హా పాల్గొనే సభ ఏర్పాట్లను డిప్యూటీ స్పీకర్ పద్మారావు తదితరులు పరిశీలించారు.