- Advertisement -
ముంబయి: శివసేన నేతలు తనపై అక్రమ కేసులు బనాయించారని ఎంపి నవనీత్ కౌర్ ఆరోపణలు చేశారు. కొంతమంది కావాలనే తనపై రాజకీయ కుట్రలకు తెరలేపారని మండిపడ్డారు. ఎన్నికైన రెండేళ్ల తరువాత తనపై కేసు వేశారని, ఐదు సార్లు ఎంపిగా గెలిచిన వ్యక్తి కుట్రలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు ప్రజలతోనే తనకు గుర్తింపు వచ్చిందని, పార్లమెంట్లో తెలుగువారి సమస్యలపై మద్దతిస్తానని కౌర్ స్పష్టం చేశారు.
- Advertisement -