Thursday, November 21, 2024

గెలుపుపై ఎవరి ధీమా వారిదే

- Advertisement -
- Advertisement -

కరీంనగర్ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలైన కరీంనగర్, మానకొండూర్, హుజురాబాద్, చొప్పదండి త్రిముఖ పోటీ కొనసాగుతోంది. కరీంనగర్‌లో మంత్రి గంగుల కమలాకర్ బిఆర్‌ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచి నాలుగవ సారి గెలిచి చరిత్ర సృష్టించాలని ప్రత్నిస్తున్నారు. బిజెపి నుండి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గతంలో రెండుసార్లు ప్రస్తుత మంత్రి గంగులపై రెండు పార్లు ఓడిపోగా ఈ సారి ఏలాగైన హిందువాదం తనను గెలిపిస్తుందని ధైర్యంగా ముందుకు సాగుతూ ముమ్మర ప్రచారం కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ నుండి కరీంనగర్ మండలలోని బొమ్మకల్ గ్రామ సర్పంచ్ పురమల్ల శ్రీనివాస్ బరిలో నిలువగా వీరిద్దరికి గట్టి పోటీ ఇస్తున్నట్లు ప్రజల్లో చర్చ జరుగుతుం ది. ఈ ఎన్నికలు కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో మంత్రి గంగుల, ఎంపి బండిలకు ప్రతిష్టాత్మకమే. హుజురాబాద్‌లో మాజీమంత్రి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బిజెపి నుండి బరిలో నిలిచారు. అంతేకాకుండా ఈటల రాజేందర్ గజ్వేల్‌లో సీఎం కేసీఆర్‌పై పోటీ చేస్తున్నారు.

బిఆర్‌ఎస్ అభ్యర్థిగా శాసనమండలి విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రచారం చేస్తు అందరిని ఆకట్టుకుంటున్నారు. ఒక్కసారి అవకాశం కల్పించి అసెంబ్లీకి పంపాలని ప్రజలను వేడుకుంటు జోరుగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి తొలిసా రిగా వొడితెల ప్రణవ్‌బాబు బరిలో నిలిచి వారిద్దరికి గట్టిపోటీ ఇస్తున్నారు. చొప్పదండి అసెంబ్లీ సెగ్మెంట్‌లో బిఆర్‌ఎస్ అభ్యర్థి , ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సీఎం చేసిన అభివృద్ధ్ది, సంక్షేమ పథకాలే తనను రెండవ సారి గెలిపిస్తా యని ధీమా వ్యక్తం చేస్తు ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ నుండి బరిలో నిలిచిన మేడిపల్లి సత్యం ఇప్పటికే రెండుసార్లు ఓటమి చెందంగా,గతం ఎమ్మెల్యేగా కొనసాగిన బొడిగ శోభ ఇప్పుడు బిజెపిలోని బరిలో దిగా రు. వీరు గెలుపుపై ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తు ఇంటింటి ప్రచా రం నిర్వహిస్తున్నారు. మానకొండూర్‌లో ప్రస్తుత బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే రసమయి బాల కిషన్ బరిలో నిలసి హ్యాట్రిక్ సాధిస్తాని అంటున్నారు.

ప్రజలంతా గులాబీ పార్టీకి బ్ర హ్మరథం పడుతున్నారని గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేపీఆర్ పథకాలే తమక శ్రీరామ రక్షా అంటు ముందుకు సాగుతున్నారు. గతంలో కాంగ్రెస్ నుండి ఎమ్మెల్యే గెలిచి ప్రభుత్వ విప్‌గా కొనసాగిన అరెపల్లి మోహన్ అప్పటి ఎన్నికల్లో ఓటమి తరువాత గులాబీ పార్టీలో చేరారు. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో బిఆర్‌ఎస్ నుండి టికెట్ రాకపోవడంతో బిజెపిలో చేరి టికెట్ సాధించి బరిలో నిలిచారు. మరో కాంగ్రెస్ అభ్యర్థి , డిడిసి జిల్లా అధ్య క్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ తొలి సారిలో బరిలో నిలిచి వీరిద్దరికి గట్టిపోటి ఇస్తు గెలుపు నాదే అంటూ ఛాలెంజ్ చేస్తున్నారు. కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి బరిలో11, కరీంనగర్ బరిలో23, హుజురాబాద్ బరిలో 11, మానకొండూర్ బరిలో 7 గురు పోటీ పడుతుండగా నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో మొత్తం 52 మంది బరిలో నిలువగా ప్రధానంగా బిఆర్‌ఎస్, బిజెపి, కాంగ్రెస్ ప్రధాన పార్టీల్లోనే పోటీ నెలకొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News