Wednesday, April 2, 2025

కర్నాటకలో రాజకీయ సంక్షోభం

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో మైసూరు ముడా కుంభకోణం కలకలం రేపుతోంది. ఈ కేసులో సిఎం సిద్ధరామయ్య విచారణను ఎదుర్కోనున్నారు. ఇందుకు రాష్ట్ర గవర్నర్‌ థావర్‌ చంద్ గెహ్లాట్‌ పర్మిషన్ ఇచ్చారు. మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్‌ అథారిటీ భూముల కేటాయింపు వ్యవహారం కర్నాటక సిఎం సిద్ధరామయ్య మెడకు చుట్టుకుంటోంది. ఈ వ్యవహారంలో ఆయనను విచారించేందుకు కర్నాటక గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లాట్‌ అనుమతి మంజూరు చేశారు. అవినీతి నిరోధక చట్టం సెక్షన్‌ 17, భారత నాగరిక్‌ సురక్ష సంహిత సెక్షన్‌ 218కింద సిఎం సిద్ధరామయ్యను విచారించేందుకు గవర్నర్‌ అనుమతి మంజూరు చేశారు.

తాజా పరిణామాలపై కాంగ్రెస్‌ భగ్గుమంది. కర్నాటక కాంగ్రెస్‌ సర్కారును కూల్చేందుకు బిజేపి ప్రయత్నిస్తోందని కాంగ్రెస్‌ ఆరోపించింది. ఈ వ్యవహారంపై చర్చించేందుకు ఈ సాయంత్రం కర్నాటక కేబినెట్‌ అత్యవసర సమావేశమవుతోంది. ఈ వ్యవహారంలో ఏం చేయాలనేదానిపై సిద్ధరామయ్యతో కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కెసి. వేణుగోపాల్‌ మాట్లాడినట్టు తెలుస్తోంది. మరో వైపు గవర్నర్‌ అనుమతి మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ కర్నాటక హైకోర్టును ఆశ్రయించే ఆలోచనలో సిఎం సిద్ధరామయ్య ఉన్నారు.

మైసూరు అర్బన్‌ డెవలప్‌మెంట్ అథారిటీ భూముల కుంభకోణం వ్యవహారంలో ముగ్గురు వ్యక్తులు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులను పరిశీలించిన తర్వాత వాటి విషయమై సంతృప్తి చెందిన గవర్నర్‌ – సిఎంపై విచారణకు అనుమతి మంజూరు చేసినట్టు రాజ్‌భవన్‌ లేఖ విడుదల చేసింది. ముడాకు సంబంధించి 14 ఇళ్ల స్థలాలను సిద్ధరామయ్య భార్యకు కేటాయించారన్నది ఆయనపై ఉన్న ప్రధాన ఆరోపణ.

 

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News