Sunday, December 22, 2024

పోటీలో నెగ్గేదెవరో ?

- Advertisement -
- Advertisement -

అసెంబ్లీ ఎన్నికల్లో అనుభవం.. కొత్తతరం మధ్య ఆసక్తికర పోరు జరుగుతోంది. సీనియారిటీ గెలుస్తుందా? జూనియర్లు విజయం సాధిస్తారా? పాత వాళ్ళనే అసెంబ్లీకి పంపుతారా? కొత్తముఖాలకు అవకాశం కల్పిస్తారా? ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారు? ఆసక్తికరపోరులో అసలు గెలుపెవరిది? అని ప్రతిఒక్కరూ చర్చి ంచుకుంటున్నారు. ప్రచారపర్వం దగ్గరపడుతున్న కొద్దీ అభ్యర్థులు జనంలోకి దూసుకుపోతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ, తుంగతుర్తి, నాగార్జునసాగర్,ఆలేరు నియోజకవర్గాల్లో పోటీ ఆసక్తిని రేపుతోంది. ఆనాలుగు నియోజకవర్గాల్లో బిఆర్‌ఎస్ పార్టీ నుండి సీనియర్లు తలపడుతుంటే..కాంగ్రెస్ పార్టీ తొలిసారి పోటీచేస్తున్న వారే బరిలో దిగా రు. తుంగతుర్తి, ఆలేరు, మిర్యాలగూడలో హ్యాట్రిక్ కోసం సీనియ ర్లు కష్టపడుతు ంటే.. తొలిసారి గెలిచి సత్తాచాటాలని జూనియర్లు పోటీలో దూసుకుపోతున్నారు.

మిర్యాలగూడలో అధికార గులాబీ పార్టీ నుండి నలమోతు భాస్కర్‌రావు, కాంగ్రెస్ నుండి బత్తుల లకా్ష్మరెడ్డి(బిఎల్‌ఆర్)లు పోటీచేస్తున్నారు. బిఎల్‌ఆర్ కొత్తముఖం అయినప్పటికీ భాస్కర్‌రావుతో తాడోపేడో తేల్చుకుంటున్నారు. అదేవిధంగా తుంగతుర్తిలో బిఆర్‌ఎస్ నుండి గాదరి కిషోర్‌కుమార్ పోటీచేస్తుండగా.. కాంగ్రెస్ నుండి మందుల శ్యామేల్ పోటీలో ఉన్నారు. ఇదిలాఉంటే నాగార్జునసాగర్‌లో బిఆర్‌ఎస్ అభ్యర్థి నోముల భగత్ రెండోసారి పోటీచేస్తుంటే.. కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు జైవీర్‌రెడ్డి తొలిసారి ఎన్నికల రణరంగంలో దిగారు. అంతేకాకుండా ఆలేరులో కారుపార్టీ నుండి గొంగిడి సునీ త పోటీలో ఉంటే.. హస్తంపార్టీ నుండి బీర్ల అయిలయ్యయాదవ్ ఫస్ట్‌సారి పోటీలో ఉన్నారు. ఈనాలుగు నియోజకవర్గాల్లో సీనియర్లు, జూనియర్ల మధ్య పోటీ జరుగుతోంది. నాలుగింట కూడా రెండుపార్టీలు బలంగా ఉండటంతో అనుభవం గెలుస్తుందా? కొత్తముఖాలే విజయం సాధిస్తాయా? అని ప్రజలంతా చర్చించుకుంటున్నారు.

ఓటర్లు మాత్రం ఎవరికి ఓటేస్తామనేది చెప్పకుండా గుంభనంగా ఉంటున్నారు. ఈఎన్నికల్లో ప్రచారపర్వంలో జనం బిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలకోసం కదిలివస్తున్నారు. రెండుపార్టీల అభ్యర్థులు, నేతలు కూడా జనాన్ని చూసి మేమంటే మేమే గెలుస్తామనే ధీమాలో ఉన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఈనాలుగు నియోజకవర్గాల ఎన్నికలపై అందరి దృష్టి పడిందని చెప్పవచ్చు. ఏదిఏమైనా చివరికి విజయం సీనియర్లదా? జూనియర్లదా? అనే అంశంపై చర్చోపచర్చలు చేస్తున్నారు. ఓటరునాడిని అందుకోలేకపోతుండటంతో ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News