Friday, December 27, 2024

పీఠం ఎవరికో!

- Advertisement -
- Advertisement -

(జె. బాలరాజు/నారాయణపేట ప్రతినిధి)
నారాయణపేట జిల్లాలో రెండు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. పేట జిల్లాలో పీఠం కోసం వివిధ పార్టీల నాయకులు పోటీ పడుతున్నారు. నారాయణపేట, మక్తల్ అసెంబ్లీ స్థానాల్లో నువ్వా నేనా? అనే స్థాయిలో ప్రచారంలో దూసుకెళ్తున్నారు. పేట అసెంబ్లీ బరిలో బీఆర్‌ఎస్.. కాంగ్రెస్ పార్టీల మధ్య గట్టి పోటీ ఏర్పడింది. మక్తల్ అసెంబ్లీ బరిలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య పోటీ నెలకొంది. ఏ పార్టీకి ఆ పార్టీ వారు తమ పార్టీ అధినేతలతో ప్రచారాలను హోరెత్తిస్తున్నారు. ఎవరికి వారు గెలుపుపై ధీమాలో ఉన్నారు. పేట జిల్లా కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందా? లేక బీఆర్‌ఎస్ కైవసం చేస్తుందా అనే కోణంలో రాజకీయ విశ్లేషకులు జోరుగా చర్చలు జరుపుతున్నారు. రెండు అసెంబ్లీ స్థానాలు బీఆర్‌ఎస్ కైవసం చేసుకొని జడ్పీ చైర్ పర్సన్ పీఠం దక్కించుకుంది. ఇటీవల ఎన్నికల్లో జడ్పీ చైర్ పర్సన్ వనజ కాంగ్రెస్‌లలో చేరింది. ఆమె చేరికతో బీఆర్‌ఎస్‌కు ఏనష్టమేమీ జరుగదని ఆ పార్టీ నేతలు అంటున్నారు.

పేట జిల్లాల్లో ద్విముఖ పోటీ…
నారాయణపేట జిల్లాలో ద్విముఖ పోటీ ఏర్పడింది. ప్రస్తుతం బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య రసవత్తరమైన పోటీ నెలకొంది. బీజేపీ పార్టీ ఇక్కడ గట్టి పోటీ ఇచ్చే అవకాశం లేదని, ఓట్లు మాత్రం ఏ పార్టీ నుండి తీలుస్తోందో అర్థం కాదు అని పలువురు అంటున్నారు.
పథకాలపై బీఆర్‌ఎస్ ఆశ…
రాష్ట్ర ప్రభుత్వం కేసిఆర్ సారథ్యంలో జరిగిన అభివృద్ది సంక్షేమ పథకాలపై ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థి రాజేందర్‌రెడ్డి ఆశలు పెట్టుకున్నారు. పేట అసెంబ్లీ బరి నుండి రెండు సార్లు గెలుపొందడం మూడవ సారా గెలిచి హ్యట్రెక్ సాధించాలనే దృఢ సంకల్పంతో ఉన్నారు. జిల్లాలో చేపట్టిన అభివృద్ది, మళ్లి అవకాశం ఇస్తే ఇంకా అభివృద్ది చేస్తాను అని ప్రజల ముందుకు వెళ్తున్నారు.

వ్యతిరేకత కాంగ్రెస్‌కు కలిసి వస్తుందా?
నారాయణపేట అసెంబ్లీ బరిలో కాంగ్రెస్ అభ్యర్థి ఫర్నికారెడ్డికి ప్రభుత్వ వ్యతిరేకత, కుటుంబం పట్ల సానుభూతి. మామ శివకుమార్‌రెడ్డి రెండు సార్లు ఓటమి పాలు కావడం వల్ల ఈ సారి ప్రజలు తమకే అవకాశం ఇస్తారని ఆ పార్టీ భావిస్తోంది. అభ్యర్థి చిట్టెం కుటుంబ వారసురాలు కావడం, తండ్రి చిట్టెం వెంకటేశ్వర్‌రెడ్డి నక్సల్స్ చేతిలో కాల్పులకు గురై మృతి చెందడం, పేటలో తండ్రి, తాత, నర్సిరెడ్డి, సానుభూతి కలిసి వస్తుందని, ఓటర్లు తమకే మొగ్గు చూపుతున్నారని ఆశతో ఉన్నారు. అందుకు తోడు మామ గెలుపు కోసం తన భుజస్కందాలపై వేసుకొని ప్రచారం నిర్వహిస్తున్నారు.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రెండు పార్టీలకు మక్తల్ అసెంబ్లీ బరిలో బీజేపీ అభ్యర్థి గట్టిపోటీనిస్తున్నారు. కుల సంఘాల ఓటర్లను తమవైపు మలుచుకునేందుకు గాలం వేస్తున్నారు. ఓటర్‌లను తమవైపు మలుచుకునేందుకు గాలం వేస్తున్నారు. గతంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రెండవ స్థానంలో ఓటమి పాలైనారు.

తండ్రి, కూతురులో గెలుపు ఎవ్వరిది?
మక్తల్ బరిలో నుండి పెద్దనాన్న రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది మళ్లీ మూడవ సారి బరిలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి ఈ సారి మక్తల్ బరిలో హ్యట్రిక్ కొడుతారా ..? నారాయణపేట అసెంబ్లీ బరిలో కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యే అభ్యర్థి చిట్టెం ఫర్నికారెడ్డి బరిలో ఉన్నారు. చిట్టెం రాంమోహన్‌రెడ్డి తమ్ముడైన చిట్టెం వెంకటేశ్వర్‌రెడ్డి కూతురు చిట్టెం పర్నికారెడ్డి పేట బరిలో గెలుపు బాటలో ఉన్నాం అంటున్నారు. ఈ రెండు అసెంబ్లీ స్థానాల్లో పార్టీలు వేరైనా ఈ కుటుంబం ఒక్కటే. ఇద్దరు గెలిస్తే జిల్లా వారి కైవసం అవుతుంది.? రెండు అసెంబ్లీ బరిలో గెలిచేది ఎవ్వరో వేచి చూడాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News