Monday, December 23, 2024

పాలమూరులో ఎవరికి పట్టం?

- Advertisement -
- Advertisement -

(బి.జి.రామాంజనేయులు/మహబూబ్‌నగర్ బ్యూరో)
పాలమూరు ఒటర్లు బిన్న మనస్సులు. జ్ఞానంతో ఓటేసే మేధావులు. ఎవరిని గెలిపిస్తారో? ఎవరిని ఓడిస్తారో ఇప్పటికిప్పుడే అంచనాకు రావడం కష్టమే. రాష్ట్ర వ్యాప్తం గా పాలమూరు నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ రాజ కీయాలు కూడా భిన్నంగా ఉంటాయి. రాజకీయ చైతన్యం కూడా ఓటర్లలో ఎక్కువగాఉంటుంది. ఈ నియోజకవర్గంలో బిసిలు, ముస్లిం సామాజిక వర్గాలు ఉన్నప్పటికీ బిసిలకే ఓటర్లు మొగ్గు చూపా రు. ఈసారి అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్నది అంతు బట్టడం లేదు. ఈ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ నుంచి గౌడ బిసి సామాజిక వర్గానికి చెందిన శ్రీనివాస్‌గౌడ్ రెండుసార్లు గెలి చి హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తుండగా, బిజెపి నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే యన్నం శ్రీనివాస్ రెడ్డి, బిజెపి నుంచి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎంపి జితేందర్ రెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి పోటీ పడుతున్నారు. ఈ ముగ్గురు కూడా రాజకీయ ఉద్దండులే కావడంతో గెలుపుపై సర్వత్రా ఉత్కంఠ నెల కొంది.

8 సార్లు బిసిలకే పట్టం కట్టిన పాలమూరు ప్రజలు
1952 నుంచి 2023 వరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సామాజిక వర్గంగా చూస్తే అత్యధికంగా 8సార్లు బిసిలకే పట్టం కట్టగా, రెండు సార్లు ముస్లింలకు, ఒక్కసారి బ్రాహ్మణ్‌కు, మూడుసార్లు రెడ్లకు ఓట ర్లు అవకాశం ఇచ్చారు. పార్టీల పరంగా చూస్తే నాలుగు సార్లు కాంగ్రె స్, రెండు సార్లు టిడిపికి, రెండు సార్లు ఇండిపెండెంట్‌కు , బిజెపికి ఒక్కసారి, ఒక్కసారి ప్రజాపార్టీకి, రెండుసార్లు స్వతంత్రులకు విజయ తీరాన్ని అందించారు. ఈసారి ఎవరికి విజయం అందిస్తారన్నది వెయ్యి డాలర్ల ప్రశ్నగా మారనుంది. మొదటిసారిగా 1952లో జరిగి న అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక సారి బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన పి. హనుమంతురావు గెలిచారు. 1957లో జరి గిన ఎన్నికల్లో ప్రజా పార్టీ నుండి బిసి వర్గానికి చెం దిన ఏగూరి చిన్నప్ప గెలి చారు. 1962, 1978లో జరిగిన ఎన్నికల్లో రెడ్డి సామా జిక వర్గానికి చెందిన ఎం, రామిరెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు.

1967,1972లో జరిగి న ఎన్నికల్లో ముస్లిం సామాజిక వర్గాని కి చెందిన అన్సారి ఇబ్రహీం ఆలి రెండు సార్లు 1980లో బిసి సామాజిక వర్గానికి చెందిన ఆంజనేయులు కాంగ్రెస్ నుంచి విజయం సాధించారు.1983,1994లో టిడిపి నుంచి రెండు సార్లు ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన పి.చంద్ర శేఖర్ విజయం సాధించారు. 1989,2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఒక సారి మరోసారి ఇండిపెంట్‌గా పద్మశాలి బిసి సామాజిక వర్గానికి చెందిన పులి వీరన్న రెండు సార్లు గెలిచారు. 2009లో ఇండిపెండెంట్‌గా ఎన్.రాజేశ్వర్‌రెడ్డి విజయం సాధించగా ఆయన అకాల మరణంతో వచ్చిన ఎన్నికల్లో బిజెపి అభ్యర్దిగా బరిలో ఉన్న యన్నం శ్రీనివాస్ రెడ్డి విజయం సాధించారు. 2014,2018లో జరిగిన ఎన్నికల్లో బిఆర్‌ఎస్ నుంచి పోటీ చేసిన గౌడ బిసి సామాజిక వర్గానికి చెందిన శ్రీనివాస్ గౌడ్ విజయదుందుభి మోగించారు. వీరిలో పి .చంద్రశేఖర్, పులి వీరన్న, శ్రీనివాస్ గౌడ్‌లు కీలకమైన మంత్రి పదవులు కూడా అలంకరించారు.

పాలమూరును శాసించనున్న బిసిలు,మైనార్టీల ఓట్లు
పాలమూరు నియోజకవర్గం లో ఏ పార్టీ అధికారంలో కి రావాలన్నా, ఎవరు గెలవాలన్నా ఇక్క డ శాసనకర్తలు, కర్త, కర్మ, క్రియ అంతా బిసి సా మాజిక వర్గానికి చెం దిన ముదిరాజ్‌లు, ఇతర బిసిలు, ముస్లిం మై నార్టీల ఓట్లే కీలకం కానున్నాయి. నియో జకవర్గంలో 2,12,833 మంది ఓట్లరు ఉన్నారు. వీరిలో ముదిరాజులు, ముస్లిం మైనార్టీల ఓట్లు లక్షకుపైగా ఉంటాయి. మొత్తం ఓటర్లలో 50 శాతం ఈ రెండు సామాజిక వర్గాలదే ఆదిపత్యంగా ఉంది. అయితే బిసిలు, ఎస్సీ, ఎస్టీ ఓట్లు కూడా ఉండగా రెడ్లు, మునూరు కాపు, గౌడ్స్, రజక, వడ్డెర, బోయల ఓట్లు కూడాబాగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ముదిరాజ్, ముస్లిం ఓటర్లు అభ్యర్దుల జాతకాలు మార్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీరి ఓట్లు ఏ పార్టీకి పడతాయన్నదే ఆసక్తిగా మారనుంది.

ఈ సారి శ్రీనివాస్ గౌడ్ హ్యాట్రిక్ కొట్టేనా?
రెండుసార్లు గెలిచిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ సాధించాలనే గట్టి నమ్మకంతో ఉన్నారు. శ్రీనివాస్ గౌడ్‌కు 2014లో మొదటి సారి బిఆర్‌ఎస్ నుంచి పోటీ చేయగా 45,447 ఓట్లు రాగా, బిజెపి నుంచి పోటీ చేసిన యన్నం శ్రీనివాస్‌రెడ్డికి 42,308 ఓట్లు పడ్డాయి. అదే విధంగా స్వతంత్ర అబ్యర్థిగా పోటీ చేసిన సయ్యద్ ఇబ్రహీంకు 27,396 ఓట్లు వచ్చాయి. ఇక కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఒబేదుల్లా కొత్వాల్‌కు 22,744 ఓట్లు నమోదు అయ్యాయి. బిఆర్‌ఎస్ పార్టీ నుంచి శ్రీనివాస్‌గౌడ్ కేవలం 3,139 ఓట్ల మెజార్టీతో గెలిచారు. రెండోసారి 2018లో జరిగిన ఎన్నిక ల్లో బిఆర్‌ఎస్ నుంచి శ్రీనివాస్‌గౌడ్ పోటీ చేయగా కనీవినీ ఎరుగని రీతిలో 86,474 ఓట్లు రాగా 54.16 ఓటింగ్ శాతం నమోదు చేసుకున్నారు. అలాగే టిడిపి నుంచి పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్‌కు 28,699 ఓట్లు వచ్చాయి. బిఎస్‌పి నుంచి పోటీ చేసిన సయ్యద్ ఇబ్రహీంకు 21,664 ఓట్లు వచ్చాయి. మరో స్వత ంత్ర అభ్యర్థి సురేంద్ర రెడ్డికి 11,633 ఓట్లు నమోదు అయ్యాయి.ఈ ఎన్నికల్లో శ్రీనివాస్ గౌడ్ 57,775 అత్యంత భారీ మెజార్టీ తో గెలిచారు.

అయితే ఈసారి జరిగే ఎన్నికల్లో రెండు మార్పులు జరిగా యి. గత ఎన్నికల్లో యన్నం శ్రీని వాస్‌రెడ్డి పోటీ చేయక పోగా, టిడిపి నుంచి పోటీ చేసిన ఎర్రశేఖర్, బిఎస్‌పి నుంచి పోటీ చేసిన సయ్యద్ ఇబ్రహీం బిఆర్‌ఎస్‌లో చేరా రు. మరొకటి 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఒబేదు ల్లా కొత్వాల్, బిఎ స్‌పి నుంచి పోటీ చేసిన సయ్యద్ ఇబ్ర హీలు ముస్లిం సామాజిక వర్గంకు చెందిన వారు. వీరి కి ఇద్దరికి కలిపి 50,140 ఓట్లు వ చ్చాయి. అంటే ఇక్క డ ముస్లిం మైనార్టీల ఓట్లు వీరికి అధిక సంఖ్య లో నమోదు అయ్యి ఉంటాయ ని రాజకీయ మేధావుల అంచనా, అలాగే 2018 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, టిడిపి మద్దతుతో ఉన్న ఎర్రశేఖర్‌కు, బిఎస్‌పి నుంచి పోటీ చేసిన సయ్యద్ ఇబ్రహీంకు కలిపి 50,363 ఓట్లు నమో దు అయ్యాయి. ఈ ఎన్నికల్లో ముస్లిం ఓట్లలో చీలిక కనిపించగా, ముదిరాజ్ ఓట్లు కొంత ఎర్ర శేఖర్‌కు కూడా బదిలి అయ్యాయనే చెప్పవచ్చు. ఈ నేపథ్యం లో శ్రీనివాస్ గౌడ్‌కు భారీ మెజార్టీ లభించింది. ఈ సారి జరిగే ఎన్నికల్లో ముదిరాజ్, ముస్లిం ఓట్లతో పాటు ఇతర బిసి, ఎస్సీ, ఎస్‌టి, ఓసి, ఉద్యోగుల ఓట్లు కూడా కీలకంగా మారనున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News