Friday, December 27, 2024

కుత్బుల్లాపూర్‌లో త్రిముఖం

- Advertisement -
- Advertisement -

(కర్రె రాజు/కుత్బుల్లాపూర్)
తెలంగాణ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకర్గంలో రాజకీయ పార్టీల హడావుడి ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్యే ఇక్కడ పోటీ నెలకొంది. ఇక్కడ అధికారపార్టీ బిఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్యే కెపి వివేకానంద పోటీలో ఉండగ, కాంగ్రెస్ పార్టీ నుండి ఉమ్మడి రాష్ట్ర మాజీ ఎంపిపి కొలన్ హన్మంత రెడ్డి బరిలో ఉన్నారు. బిజెపి నుండి మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ ఎన్నికల బరిలో నిలిచారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించండంతో మొదట టిక్కెట్ల రేసులో ఉన్న వీరు చివరకు బీఫాంలు దక్కించుకుని నామినేషన్లు వేసి బరిలో దిగారు. మూడు పార్టీలకు ఎమ్మెల్యే టిక్కెట్ల కోసం ఆశావహులు ఉన్నా వారిని తమదైన శైలిలో బుజ్జగింపులు చేసినా అక్కడక్కడ అభ్యర్థులకు అసమ్మతి వర్గ స్వరం వీరిని వెంటాడుతూనే ఉంది. అయినా ప్రచారంలో ముందుకు వెళుతున్న మూడుపార్టీల అభ్యర్థుల చేరికల కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

మొదట బిఆర్‌ఎస్ అభ్యర్థి వివేకానంద జంప్‌జిలానీలపై దృష్టి పెట్టి బిజెపి రాష్ట్ర నాయకులు, కాంగ్రెస్ పార్టీల నుంచి దళిత నాయకులను బిఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు. అదే పంథాలో ముందుకు వెళ్లిన కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికార పార్టీ నుండి నిజాంపేట మాజీ సర్పంజ్‌తో పాటు బహదూర్‌పల్లి మాజీ సర్పంజ్, కొంపల్లి మాజీ సర్పంజ్, జిల్లా పరిషత్ మాజీ వైస్ ఛైర్మన్ , షాపూర్‌నగర్ మాజీ కార్పొరేటర్‌తో పాటు అధికార పార్టీ ఎమ్మెల్యే బాబాయ్, మాజీ కార్పొరేటర్ భర్త కేఎం ప్రతాప్, ఆయన కుమారుడు కేపి విశాల్‌తో పాటు మరి కొంత మంది ముఖ్యనేతలకు కాంగ్రెస్ గూటికి చేరేలా పథకం రచించి సక్సెస్ అయ్యారు. అధే విధంగా బిజేపి సైతం యువత వైపే దృష్టి సారించి అత్యధికంగా యువకులు చేరేలా ప్రథకం వేసి షాపూర్‌నగర్ నుండి ఓ కీలక నాయకుడిని పార్టీలో చేరేలా శ్రమించి ప్రచారంపై దృష్టిసారించారు.

నేతల స్టార్ క్యాంపెయినింగ్‌లు
కుత్బుల్లాపూర్ నియోజకర్గంలో వివిధ రాష్ట్రాల నుండి వచ్చి జీవనం సాగిస్తున్న ఓటర్లను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు పోటీపడుతున్నాయి. మొదట బిఆర్‌ఎస్ పార్టీ తరపున మంత్రి కెటిఆర్ రోడ్‌షోతో బోణీ కొట్టారు. ప్రచారంలో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజకర్గంలో పర్యటించిన మంత్రి కెటిఆర్ ప్రభుత్వ సంక్షేమ పథకాలే పార్టీ అభ్యర్థ్ది గెలుపునకు అన్నారు. అదే విధంగా బిజెపి అభ్యర్థి కూన శ్రీశైలంగౌడ్‌కు మద్దతుగా తమిళనాడు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు, మాజీ ఐపిఎస్ అన్నామలై ప్రచారంలో పాల్గొని తమిళ ఓటర్లతో పాటు యువతను ఉద్దేశించి మాట్లాడుతూ కూన శ్రీశైలంగౌడ్ గెలుపునకు బాటలు వేయాలని కోరారు. అదే విధంగా బిజెపి పార్లమెంట్ సభ్యుడు, నటుడు రవికిషన్ ప్రచారంలో పాల్గొని కేంద్ర పభుత్వ పథకాలు వివరించి బిజెపి అభ్యర్థికి ఓటు వేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ది కొలణ్ హన్మంతరెడ్డికి మద్దతుగా ఏఐసిసి నేత మల్లిఖార్టున ఖర్గేతో పాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మానిక్‌రావు ఠాక్రే , పిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కుత్బుల్లాపూర్ మైదానంలో బహిరంగ సభ ఏర్పాటు చేసి హన్మంతరెడ్డికి మద్దతు నిలిచి గెలిపించాలని కార్యకర్తలను, నాయకులను కోరారు.

ఆశల పల్లకిలో అభ్యర్థులు… ఏవరి వైపు నిలుస్తారో ఓటర్లు?
కుత్బుల్లాపూర్‌లో తాను ఎప్పుడు ప్రజల మధ్యే ఉంటూ ప్రజలకు అందుబాటలో ఉంటున్నానని ఎమ్మెల్యే కెపి వివేకానంద తన గెలుపు పై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు ఈసారి అంతా మార్పు కోరుకుంటున్నారంటున్న హన్మంతరెడ్డి రెడ్డి , మైనారీటీలు, రెడ్డి వర్గం, ప్రభుత్వ వైఖరితో విసిగిన వారు అంతా తనకే పట్టం కడుతారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.గతంలోఒడిన అభ్యర్థిగా తన పట్ల సానుభూతితో టర్లు తనను గెలిపిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా బిజెపి అభ్యర్థి కూన శ్రీశైలంగౌడ్ ప్రధానంగా కేసిఆర్ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడుతు బిజేపి సుపరిపాలన వస్తే యువతకు భరోసా ఉంటుందని ప్రచారంలో చెబుతున్నారు. . కుత్బుల్లాపూర్‌లో వివిధ రాష్ట్రాల నుండి వలసలు వచ్చి స్థిరపడిన ఓటర్లు తనకే బిజెపికే మద్దతు ఇస్తారని ఆయన నమ్ముతున్నారు. అయితే మూడు పార్టీల మధ్య త్రిముఖ పోటీతో కుత్బుల్లాపూర్ రాజకీయం రసవత్తరంగా సాగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News