Monday, December 23, 2024

షాద్‌నగర్‌లో చతుర్ముఖం

- Advertisement -
- Advertisement -

(కె.భాస్కర్/మన తెలంగాణ)
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వా త అధికారాన్ని చేపట్టిన కేసీఆర్ అప్పుడే తొమ్మిదిన్నరేళ్లను పూర్తి చేసుకున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో టిఆర్‌ఎస్ పేరు మార్చి బిఆర్‌ఎస్ పార్టీ పేరుతో అదే కారు గుర్తుపై పోటీ చేస్తున్నారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా వై.అంజయ్య యాదవ్ బరిలో ఉన్నా రు. ప్రభు త్వ సంక్షేమ పథకాలను నమ్ముకొని ఆయన బరిలో దిగుతుంటే, రెండు పర్యాయాలు దెబ్బతిన్న కాంగ్రెస్ పట్టుకోసం తహతహలాడుతోం ది. ప్రధాని మోడీ పాలనను నమ్మి బీజేపీ అడుగులు వేస్తుంటే బహుజన రాజ్యం అంటూ దూసుకొచ్చిన బీఎస్పీ, సేవా కార్యక్రమాలు చేశాను ఆశీర్వదించండంటూ సింహం గుర్తు తో పాలమూరు విష్ణువర్ధన్‌రెడ్డి ప్రజల ముందు కు వచ్చారు. శాసన సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయ నాయకులు ఓటర్ దేవుళ్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.

గత శాసన సభ ఎన్నికల కంటే ప్రస్తుతం జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ సమీకరణలు భిన్నంగా ఉంటాయని నేతలు గుసగుసలాడుకుంటున్నారు. ప్రజల్లో కాంగ్రెస్‌కు పాజిటివ్ టాక్ వస్తుండడంతో చాపకింద నీరులా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళుతోంది. అధికార పార్టీ బిఆర్‌ఎస్ మాత్రం ప్రభుత్వ సంక్షేమ పథకాలు, గత కాంగ్రెస్ పాలనకు, ప్రస్తుత కెసిఆర్ సర్కార్‌కు మధ్య వ్యత్యాసాన్ని వివరిస్తూ ముందుకు అడుగులు వేస్తోంది. ఇక ప్రజా పాలన తమతోనే సాధ్యమని, ప్రస్తుత ఎన్నికల్లో తామేమి తక్కువ కాదంటూ భారతీయ జనతా పార్టీ అభివృద్ధ్ది బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి అందె బాబ య్య సంక్షేమం పేరుతో ఓటర్ దేవుళ్ళను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ పోటా పోటీగా ప్రచారం చేస్తుండడంతో ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోంది.

ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిక వల్ల ఎవరికి నష్టం
ఆయా పార్టీలకు కునుకు లేకుండా చేస్తున్నాయి ఏనుగు, సింహం గుర్తులు. బహుజన సమాజ్ పార్టీ తరపున యువకు డు ప్రశాంత్ బరిలో నిలవడం నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అధికంగా ఉండడంతో చాలా వరకు దళిత, బీసీ ఓట్లు గంపగుత్తగా బీఎస్పీకి పడే అవకాశాలు ఉన్నాయి. అయితే బీజేపీ టిక్కెట్ ఆశించి భంగపడ్డ పాలమూరు విష్ణువర్ధన్‌రెడ్డి ఆల్ ఇండియా పార్వర్డ్ బ్లాక్ పార్టీ తరపున బరిలో దిగారు. సింహం గుర్తును విష్ణువర్ధన్‌రెడ్డి ప్రజల్లోకి బలంగా తీసుకెళుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును బీఎస్పీ, సింహం పంచుకుంటే బీఆర్‌ఎస్ గెలుపును ఎవరు ఆపలేరని, అదే గనక జరిగితే కాంగ్రెస్‌కు గత ఎన్నికల్లో ఎదరైన పరాభవమేనని విశ్లేషకులు చెబుతున్నారు. గత రెండు పర్యాయాలు బీఆర్‌ఎస్‌కు అవకాశం ఇచ్చా రు.

ఒక్కసారి కాంగ్రెస్‌కు అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధ్ది చేసి చూపిస్తామని, సోనియా ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాలను పూర్తిస్థాయిలో అమలు చేస్తామంటూ కాంగ్రెస్ అభ్యర్థి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే అనేక పర్యాయాలు నియోజకవర్గంలోని కొత్తూరు, నందిగామ, ఫరూఖ్‌నగర్, కేశంపేట, కొందుర్గు, జిల్లేడు చౌదరిగూడ మండలాల్లో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులతోపాటు ముఖ్యనేతలతో సభలు, సమావేశాలు ఏర్పాటు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా కాంగ్రె స్ జెండా ఎగురవేయాలనే లక్షంగా అందరిని కలుపుకుం టూ ఓటర్ దేవుళ్లను ప్రసన్నం చేసుకుంటు ముందుకు సాగుతున్నారు. ఇక తెలంగాణ సెంటిమెంట్‌తోపాటు సిఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ఫథకాలను ప్రజలకు వివరించడంతోపాటు మరోమారు అవకాశం ఇవ్వాలంటూ ఓటర్లను బీఆర్‌ఎస్ నేతలు అభ్యర్థిస్తున్నారు.

దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు తెలంగాణలో కొనసాగుతున్నాయని, మరోమారు అవకాశం ఇస్తే బంగారు తెలంగాణగా తీర్చిదిద్దనున్నట్లు బీఆర్‌ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా మొదటిదాఫ ప్రచారాన్ని పూర్తి చేసుకున్న బీఆర్‌ఎస్ మరోమారు ప్రచారం నిర్వహించే పనిలో పడ్డారు. ప్రజలను ప్రసన్నం చేసుకునే పనిలో రాజకీయ పార్టీల నేతలు ఎవరికి వారు ఇలా ప్రయత్నాలు చేస్తుండటంతో షాద్‌నగర్ ఎమ్మెల్యే సీటు ఏ రాజకీయ పార్టీకి వరిస్తుందోనని విశ్లేషకులు జోరుగా చర్చించుకుటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News