జోగిపేట: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుంటంతో అందోల్‌లో రాజకీయం వేడెక్కింది. పోటీలో ఉండే నాయకులు టికెట్ల కోసం వారి, వారి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ సారి ఎన్నికల్లో కాంగ్రెస్ నంచి సీనియర్ నాయకుడు, మాజీ డిప్యూటి సిఎం దామోదర్ రాజనర్సింహ పేరు ఖరారు అయినట్లుగానే చెప్పవచ్చు. భారతీయ పార్టీ నుంచి చివరి ఎన్నికల్లో మాజీ మంత్రి బాబూమోహన్ బరిలో నిలిచారు. ఈ సారి ఆయనకే టికెట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కమలంలో కూ డా టికెట్ కోసం పోటీ పడుతున్నారు. నియోజకవర్గానికి చెందిన బాలయ్య జడ్పీ చైర్మన్‌గా పనిచేశారు. ఈ సారి నాకు టికెట్ ఇవ్వాలని ఆయన కూడా అధిష్టాణానికి మొరపెట్టుకున్నారు. ఇదిలా ఉండగా గులాబిదళంలోనే పోటీ ఎక్కువగా ఉందనే చెప్పవచ్చు. గతంలో సిఎం కెసిఆర్ సిట్టింగులకే మళ్లీ టికెట్లు కేటాయిస్తానని ప్రకటించడంతో ప్రస్తుతం ఎమ్మెల్యే స్థానికుడు క్రాంతికిరణ్ దీ మాగా ఉన్నారు. అందోల్ జడ్పిటిసిగా పనిచేస్తున్న ఖాదిరాబాద్ రమేశ్ జడ్పిటిసి ఫోరం రాష్ట్ర అధ్యక్షుడుగా పనిచేస్తున్నాడు.
ఈ సారి టికెట్ తనకు కేటాయించాలని అధిష్టానానికి విన్నవించుకున్నారు. ఇతనికి ప్రస్తుత జడ్పిటిసి మంజూశ్రీ భర్త జైపాల్‌రెడ్డి ఆశిస్తులు నిండుగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. రమేశ్ నియోజకవర్గంలోని అ న్ని మండలాలలో తిరిగుతూ పేద ప్రజలకు ఆర్థిక సా యం చేస్తూ ఆదరణ పొందే ప్రయత్నాలు చేస్తున్నారు. వి విధ మండలాల్లో ఆయన మద్దతుదారులు ప్లెక్సిలు వేశా రు. ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌కు, రమేశ్‌కు మధ్య దూరం పెరిగింది. మనస్పర్థలు తీవ్రరూపం దాల్చాయి. తనపై ఎమ్మెల్యే కక్షగట్టినట్లు ఆయన పలు సందర్భాల్లో చె ప్పారు. చాలా రోజులుగా మండలంలో జరుగుతున్న అ ధికారిక కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉంటున్నా రు. ఈ విషయమై ఆయన్ని ప్రశ్నించగా తనకు ఆ హ్వానం పంపడంలేదని ఈ విషయమై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో పాటు, పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లిన ట్లు చెప్పారు. ఇంతే కాకుండా జోగిపేటలో చాలా కాలం పాటు వ్యవసాయశాఖలో పనిచేసిన వైద్యనాథ్ అధికార పార్టీ టికెట్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
ఈయన గజిటె డ్ యూనియన్‌లో పే రున్న నాయకుడు కా వడంతో ఆ సంఘానికి చెందిన మాజీ నాయకుడు దేవిప్రసాద్, టిఎన్‌జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్‌తో పైరవీలు చేస్తున్నాడు. ఈ క్రమంలో మంత్రి హరీశ్‌రావుతో పలు మా ర్లు కలిశారు. అతనికి దాదాపుగా ఖరారు అయినట్లు ప్ర చారం జరుగుతుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థి నాయకుడిగా పనిచేసిన ఎర్రోల్ల శ్రీనివాస్ పేరు కూడా తెరపైకి వచ్చింది. ఇతను ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌గా పనిచేశారు. గత ఆరు మాసాలుగా జహీరాబాద్ ని యోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రచారం తీవ్రంగా జరిగినా అక్కడ మంచి పేరున్న స్థానిక నాయకుడు బీఆర్‌ఎస్‌లో చేరడంతో అక్కడి నుంచి ప్రయత్నాలు విరమించుకున్నాడు. అందోల్‌పై దృష్టి పడింది. ఆయనకున్న పరిచయాలతో టికెట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అధిష్టానం పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది.