రంగారెడ్డి: ఎన్నికలు మరో రెండు మూడు నెలలలో జరుగుతున్న నేపధ్యంలో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రోజురోజుకు రాజకీయాలు మారిపోతున్నాయి. గతంలో పోటీ చేసిన వారే కాకుండా ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు కొత్త ముఖాలు తెరపైకి వస్తున్నాయి. స్తానిక సీనియర్ నేతలతో పాటు ఎప్పుడు పోటీ చేయని వారు కూడ ఇక్కడి నుండి పోటీకి సిద్ధ్దమవుతున్నారు. రానున్న ఎన్నికలలో తమ రాజకీయ భవిషత్తును పరీరక్షించుకుంటామని దీమా వ్యక్తం చేస్తున్నారు. కొత్త వారితోపాటు గతంలో పోటీ చేసినవారు బరిలోకి దిగె అవకాశాలు మెండుగా ఉన్నాయి. అ ధికార పార్టీలో మా త్రం ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే లేదా ఆయన తనయుడు పోటీ చేసే అవకాశాలు మె ండుగా ఉన్నట్లు తెలుస్తుంది.
“ కారు”లో కొత్త ఆశలు: ఎన్నికలు సమీపిస్తున్న వేళ నాలుగవ సారీ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి పొందాలని ఆశతో ఉన్న బిఆర్‌ఎస్‌లో అక్కడక్కడ భిన్నమైనా వాదనలు వినిపిస్తున్నాయి. పార్టీకి తాము వ్యతిరేఖం కాదని ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేకు కాకుండా యువనేతకు ఇవ్వాలని మెజార్టీ నేతలు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయన స్థానంలో యువనేత బంటికి ఎక్కువ క్రేజ్ ఉందని ఆయనకైతే గెలుపు సునాయాసంగా ఉంటుందని నేతలు సైతం అభిప్రాయపడతున్నట్లు కొత్త రాగం వినిపిన్నారు.. గతంలో ఐఎస్ సదన్ కార్పోరేటర్‌గా గెలుపొందిన ధాఖలాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే మరి కొందరు అధిష్ఠానం పై మరికొందరు గంపాడాశలు పెట్టుకున్నారు. అవకాశం వస్తే బిఆర్‌ఎస్ నుంచి పోటీ చేస్తామనే దీమాతో ఉన్నారు. ఇటీవల సీఎం కెసిఆర్ , ఐటి మంత్రి కెటిఆర్‌ను సైతం కలిసి తమ రాజకీయ వీలు నామాను సమర్పిసుంచినట్లు వార్తాలు వెలువడ్డాయి. అలాగె మండలాలుగా తిరుగు తూ సమావేశాలు నిర్వహిస్తున్నారు.వీరి వెనుక ఎవరున్నారనే చర్చ నియోజకవర్గంలో కొనసాగుతుంది. ఏది ఏమైనా నాలుగవ సారీ మళ్ళీ ఎమ్మెల్యేగా మంచిరెడ్డి కి షన్‌రెడ్డి గెలిచి గులాభీ జెండా ఎగురవేస్తారనే దీమాతో ఆయన వర్గం ఉంది.
కాంగ్రెస్‌లో పోటీ కోసం కయ్యాలు
కర్ణాటక ఎన్నికల గెలుపుతో రాష్ట్రంలోనూ ఒక్క సారీగా కాంగ్రెస్ పుంజుకున్నదనే చెప్పాలి. కానీ ఒకప్పుడు భలంగా ఉన్నా కాంగ్రెస్ నేడు ఒక్కొక్కరుగా చే జారడ ంతో మిగిలిన వారు సైతం పోటీకి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చిన ఎదుర్కోని అధికారంలోకి వస్తామన్నదీమాతో ఉంది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కొత్త ,పాత ము ఖాలను రంగంలోకి ది ంపేందుకు అధిస్టానం యోచిస్తోంది. ఇప్పటి నుంచే పార్టీ టికెట్ కోసం తమ నేతలను ఆ లింగనం చేసుకోని పైరవీలు న డుపుతున్నారు. ఈ మధ్యనే పిసిసి ఎస్‌సి, బీసీ,ఓసిలు పోటీ చేసేవారు రూ. 50వేల నుండి 25 వేలు గాంధీ భవనంలో చెల్లించాలని కో రినట్లు తెలిసింది.
ఇందుకోసం తమ నేతల ఆశీస్సులల కోసం ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా పట్నం బరిలో బీసీ బడుగు బలహీనవర్గాలకు చెందిన నేత ఈసి శేఖర్‌గౌడ్ ( మామ) , కొత్త కుర్మ శివకుమార్ ,ఓసి సామాజిక వర్గానికి చెందిన పిసిసి సభ్యులు ,మాజీ ఎంపిపి మర్రి నిరంజన్‌రెడ్డి , మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ,టీపీసీసీ ప్రచార కమిటి కార్యదర్శి దండెం రాంరెడ్డిలు, సైతం బరిలోకి దిగె అవకాశాలు ఉన్నట్లు వారి అనుచరులు చెబుతున్నారు.
బిజెపిలో తీవ్రమైన పోటీ : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో పార్టీ టికెట్ కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. గతంలో పోటీ చేసి ఓడిన కొత్త అశోక్‌గౌడ్ , పోరెడ్డి బ్రదర్స్, మరోసారీ పోటీ చేసేందుకు ఉత్సహాం చూపుతున్నారు. మరోసారీ అదృష్టం పరీక్షించేందుకు పోటీ చేసే అవకాశం ఇవ్వాలని అధిష్ఠానంను కోరుతున్నారు. గతంలో పోటీ చేసిన చేసిన అనుభవంతో వ్యయ ప్రయాసాలకు వెనుకాడకుండా ఖర్చుచేసిన విషయం తెలిసిందె. మరోదపా పోటీ చేసే అవకాశం కల్పించాలని ఇ ప్పటికే కేంద్ర నాయకత్వంను కలిసి తమ బయే డెటాను సమర్పించారు.
గతంలో బువనగిరి పార్లమెంటుకు ఎన్నికైనా భూర నర్సయ్యగౌడ్ స్తానికేతరులైనప్పటికి ఆయన కూడ ఇబ్రహీంపట్నంపై పోటీ చేసేందుకు ఉత్సహం చూపుతున్నట్లు తెలుస్తుంది. అంతెకాకుండా నియోజకవర్గం నుంచి ముత్యాల భాస్కర్ ,బోసుపల్లి ప్రతాప్, నోముల దయానంద్‌తో పాటు అవకాశం వస్తే మరో 10 మంది వరకు లైన్లలో ఉంటారని బీజేపీ శ్రేణులలో ఉంది. ఏది ఏమైనప్పటికి మోడీ చేసిన అభివృద్ది ప్రజలలో మంచి ప్రభావం ఉండడంతో బీజేపీలో పోటీ చేసేందుకు ఉత్సహాం చూపుతున్నారు.
కమ్యూనిస్టులు సైతం రంగంలోకి: ఇబ్రహీంపట్నం ని యోజకవర్గంలో కామ్రేడ్లు సైతం మూడు సార్లు ఎమ్మెల్యే గెలిచిన సందర్భాలునాయి.ఈ ప్రాంత ఉద్యమ కారులు మహాబూబ్‌పాష, నరహరి హత్య అనంతరం మొట్టమొదటి సారీ కొండిగారి రాములు రెండు సార్లు, మస్కు నర్సింహ్మ ఒకసారీ గెలుపొందిన విషయం తెలిసిందె .మరో సారీ కాలం కలిసి వస్తే ఈ ప్రాంతం నుండి ఎర్రజెండా ఎగుర వేయాడానికి పావులు కదుపుతున్నట్లు సమాచారం . ఇప్పటికే బడుగు బలహీన వర్గాలకు చె ందిన వారిని ఉద్యమాల వైపు మళ్ళించి పోరుబాట ప ట్టారు. ప్రజలను సమీకరించి వారిని ఊరువాడ చైతన్యం చేసే పనిలో పడ్డారు.
ఈసారీ ఎన్నికలు ఎప్పుడు వచ్చిన ఎదుర్కోవాడానికి వారు సిద్ధ్దంగా ఉన్నట్లు తెలుస్తుంది. అధికార పార్టీ ఒకానొక దశలో కామ్రేడ్లు, బిఆర్‌ఎస్ కలిసి పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు మునుగోడు ఎన్నికలు రుజువు చేశాయి. రాష్ట్రంలో పొత్తు ఉంటె సీపీఎం ఇబ్రహీంపట్నం సీటు తమకె కేటాయించాలని ఆ పార్టీ కోరినట్లు తెలిసింది.
ఒకవేళా ఇవ్వని ఎడల ఒంటరిగా పోటీ చేస్తామని తేల్చి చెప్పినట్లు ఒక సభలో తమ్మినేని సృష్టం చేశారు. బిఎస్‌పి, టిడిపి సైతం పోటీ: నియోజకవర్గంలో గత ఎన్నికలలో కాగ్రెస్, బిఎస్‌పి, వామపక్షాలు పొత్తుతో బిఎస్‌పి నుంచి టికెట్ తెచ్చుకొని పోటీ చేసిన అభ్యర్థి 300 వందల ఓట్లతో ఓటమి పాలైయ్యారు. అంతటి తో ఆగా కుండా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీన్‌కుమార్ పట్నంలో మరోసారీ బలమైనా అభ్యర్థిని దించాలనే ఉద్దెశంతో పావులు కదుపుతున్నారు. గతంలో బిఎస్‌పి ఎక్కడ లేని ఆదరణ పెరిగి ఒకా నొక దశలో గెలిచారని సంబురాలు చేస్తున్నారు. ఈ సార్టీ కూడ తమ పార్టీ గెలుస్తుందనే ధీమాతో ఉన్నారు. గత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ , కాంగ్రెస్ పొత్తు పెట్టుకొని పోటీ చేసిన తెదెపా అభ్యర్థికి 14వేల ఓట్లు రావడంతో కొంత క్యాడర్ ఉత్సహాం ఉంది. ఈసారీ కూడ బిఆర్‌ఎస్‌మీద వ్యతిరేకతో మరోసారీ పోటి చేస్తామని చెప్పుతున్నారు.