Saturday, December 21, 2024

సెప్టెంబర్ 17 సెగ

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో పోటాపోటీగా పార్టీల సభలు

సెప్టెంబర్ 17 చుట్టే తిరుగుతున్న తెలంగాణ రాజకీయం

సిఎం కెసిఆర్‌ను టార్గెట్ చేసేలా బిజెపి, కాంగ్రెస్ భారీ బహిరంగ సభలు

రంగంలోకి దిగిన ముఖ్యమంత్రి

ప్రతిపక్షాలకు చెక్ పెట్టేలా ముఖ్యమంత్రి భారీ వ్యూహం

16న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయం

రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే భారీ బహిరంగ సభ

సెప్టెంబర్ 17న ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాల్లో ‘పల్లె పల్లెనా ఊరేగింపు’లతో పెద్దఎత్తున సంబురాలు

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం సెప్టెంబర్ 17వ తేదీ చుట్టూ తెలంగాణ రాజకీయం తిరుగుతోంది. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించి పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభలు పెట్టి కెసిఆర్‌ను టార్గెట్ చేయాలని ప్రతిపక్షాలు భావిస్తుంటే, ప్రతిపక్షాలకు చెక్ పెట్టేలా భారీ వ్యూహాన్ని సిఎం కెసిఆర్ సిద్ధం చేశారు. సెప్టెంబర్ 17 కాంగ్రెస్, బిజెపి పార్టీలు బహిరంగ సభలు నిర్వహించేందుకు సిద్ధమవుతుంటే ఒక రోజు అంటే సెప్టెంబర్ 16న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారు. ఇందులో భాగంగా నార్లాపూర్ ఇన్‌టెక్ సెప్టెంబర్ 16వ తేదీన మధ్యాహ్నం బటన్ నొక్కి బాహుబలి పంపు ద్వారా కృష్ణా జలాలను సిఎం కెసిఆర్ ఎత్తిపోయనున్నారు. దశాబ్ధాలుగా ఎదురుచూస్తున్న తెలంగాణను సస్యశ్యామలం చేసే పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించుకుంటున్న చారిత్రక సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఆ మరుసటి రోజు (సెప్టెంబర్ 17 న) ఉమ్మడి పాలమూరు రంగారెడ్డి జిల్లాల్లోని పల్లె పల్లెనా ఊరేగింపులతో ఈ విజయాన్ని పెద్ద ఎత్తున సంబురాలు జరుపుకోనున్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రారంభానికి పల్లె పల్లె నుంచి సర్పంచులు సహా తరలివచ్చే ప్రజలు కలశాలు తెచ్చుకుని వాటితో తీసుకెళ్లిన కృష్ణా జలాలతో ఆయా గ్రామాల్లో దైవాల పాదాలను అభిషేకించి మొక్కులు చెల్లించుకోనున్నారు.
తీరనున్న నీటి అవసరాలు
ప్రపంచంలోనే మరెక్కడా లేని అత్యంత భారీ పంపులతో నిర్మితమైన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నుంచి దక్షిణ తెలంగాణ ప్రజల తాగునీరు సాగునీరు అవసరాలను ఈ ఎత్తిపోతలు తీర్చనున్నాయి. ఉమ్మడి పాలనలో నిర్లక్ష్యానికి గురైన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి స్వరాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వ దార్శనికతతో అనేక అడ్డంకులను దాటుకుని మోక్షం లభించడం చారిత్రక సందర్భం. దశాబ్ధాల కల సాకారమవుతున్న చారిత్రక సందర్భంలో దక్షిణ తెలంగాణ రైతాంగానికి ప్రజలకు ఇది గొప్ప పండుగ రోజుగా నిలువనుంది. కృష్ణా నదికి అనుసంధానించి, (శ్రీశైలం ఫోర్ ప్లో వద్ద) నార్లాపూర్ వద్ద నిర్మించిన ఇన్‌టెక్ వద్దకు చేరుకొని అక్కడ స్విచ్ ఆన్ పంపులను ప్రారంభిస్తారు. వెట్న్ ద్వారా బాహుబలి పంపుల గుండా ఎగిసిపడే కృష్ణా జలాలు సమీపంలోనినార్లాపూర్ రిజర్వాయర్‌కు చేరుకోనున్నా యి . మోటర్లు ఆన్ చేసిన వెంటనే సిఎం కెసిఆర్ నార్లాపూర్ రిజర్వాయర్ వద్దకు చేరుకుని రిజర్వాయర్‌కు ఎత్తిపోతల ద్వారా చేరుకుంటున్న కృష్ణా జ లాలకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. తె లంగాణ సాగునీటి రంగం చరిత్రలో మరో సువర్ణధ్యాయం లిఖించనున్నది. ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లోని ప్రతి పల్లెనుంచీ సర్పంచులు గ్రామస్థులు ఈ బహిరంగ సభకు హాజరుకానున్నారు.
17న బిజెపి..16,17 తేదీల్లో కాంగ్రెస్ సభలు
సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించడానికి బి జెపి సిద్ధమైంది. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని బిజెపి ప్లాన్ చేసింది. ఈ సభకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా లేదా రాజ్‌నాథ్ సిం గ్ వచ్చే అవకాశం ఉన్నట్టు పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతుంది. మరికొద్ది రోజుల్లో ఎన్నికలు రాను న్న నేపథ్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం నాడు, తెలంగాణ సెంటిమెంట్‌తో ప్రజాక్షేత్రంలో కి వెళ్లాలని బిజెపి భావిస్తుంది. మరోవైపు తెలంగాణలో ఈనెల 16, 17 తేదీలలో కాంగ్రెస్ పార్టీ వ ర్కింగ్ కమిటీ సమావేశాన్ని హైదరాబాద్‌లో నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 17వ తేదీన భారీ ర్యాలీ నిర్వహించి బహిరంగ సభ నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోంది. ఈ భారీ బహిరంగ సభను కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది.

కాంగ్రెస్ పార్టీ కూడా సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్‌లోనే భారీ బహిరంగ సభ నిర్వహించాలని రక్షణ శాఖకు దరఖాస్తు చేసుకుంది. దీంతో సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం రోజు కాంగ్రెస్, బిజెపిలు పోటాపోటీగా బహిరంగ సభలకు రెడీ అయ్యాయి. దీంతో ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ను టార్గెట్ చేసి, తెలంగాణలో తమ సత్తా చాటి, పట్టు నిలుపుకునే ప్రయత్నం రెండు పార్టీలు చేయనున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ సిఎం కెసిఆర్ రూట్ మార్చారు. బిజెపి, కాంగ్రెస్ సభలకు కౌంటర్‌గా సెప్టెంబర్ 16వ తేదీన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించాలని సిఎం కెసిఆర్ ఇ ప్పటికే నిర్ణయించిన విషయం తెలిసిందే. మొత్తం గా తెలంగాణ రాష్ట్రంలో పాలిటిక్స్ సెప్టెంబర్ 17వ తేదీ చుట్టూ తిరుగుతూ ఉండడం ఆసక్తికరం గా మారింది. అయితే సెప్టెంబర్ 17 పాలిటిక్స్‌లో ఏ పార్టీ ప్రజల మద్దతును గెలుచుకుంటుంది అనేది మాత్రం వేచి చూడాల్సిందే.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News