Thursday, January 23, 2025

మద్నూర్‌లో వేడెక్కుతున్న రాజకీయం

- Advertisement -
- Advertisement -

మద్నూర్: మద్నూర్‌లో రోజు రోజుకు రాజకీయం వేడెక్కుతుందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. బిఆర్‌ఎస్ నాయకుల్లో సమన్వయ లోపంతో మండలంలో రాజకీయాలు రోజుకో మలుపు తిప్పుతున్నాయి. ఈ ప్రభావం జుక్కల్ నియోజకవర్గ బిఆర్‌ఎస్ పై పడనుందని పలువురు పేర్కొంటున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ మద్నూర్‌లో రాజకీయం వేడెక్కడంతో గ్రూపు తగాదాలు నివురు గప్పిన నిప్పులా మారుతున్నాయి. స్వంత పార్టీలోనే రచ్చ కొనసాగుతుండటంతో చర్చనీయాంశంగా మారింది.

ఈ ప్రభావం రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామం ఉంటుందని, పలువురు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉండగా, కాంగ్రెస్‌లో సైతం ఇదే తంతు కొనసాగుతుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఆరు నెలలుగా ఈ నియోజకవర్గంలో నూతన వ్యక్తులు గ్రామ గ్రామాన తిరుగుతుండటంతో ఎవ్వరికి టికెట్ వస్తుందోననే బెంగ నాయకుల్లో నెలకొంది. ఇదిలా ఉండగా, మద్నూర్ రాజకీయం ఎటువైపు దారి తీస్తుందోనని, విభేదాలు సద్దుమణుగుతాయా లేక తీవ్ర ప్రభావం చూపుతాయా అని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News