Sunday, January 19, 2025

గద్దర్ భౌతికకాయానికి రాజకీయ, సినీ ప్రముఖుల నివాళి…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రజా యుద్ధనౌక గద్దర్ భౌతికకాయానికి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు నివాళులర్పించారు. అపోలో స్పెక్ట్రా అమీర్‌పేట ఆస్పత్రిలో గద్దర్ చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మరణ వార్త వినగానే అభిమానులు, కళాకారులు, రచయితలు, వామపక్ష భావజాలం కలిగిన వారంతా శోక సంద్రంలో మునిగారు. ప్రజలు, అభిమానుల సందర్శనార్ధం ఆయన భౌతిక కాయాన్ని ఆదివారం సాయంత్రం ఎల్బీస్టేడియానికి తరలించారు. దీంతో గద్దర్ పార్థీవదేహానికి నివాళులర్పించేందుకు పెద్ద ఎత్తున ప్రజలు, అభిమానులు, కవులు, కళాకారులు, రాజకీయ, సినీ ప్రముఖులు ఎల్బీస్టేడియానికి చేరుకుంటున్నారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి, సీతక్క, భట్టీ విక్రమార్క, శ్రీధర్ బాబు, అద్దంకి దయాకర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బిజెపి నేత వివేక్ వెంకటస్వామి, మందకృష్ణ మాదిగ, విసి సజ్జనార్, రాష్ట్ర మంత్రులు తలసాని, ఎర్రబెల్లి, సబితా, ఇంద్రకరణ్ రెడ్డి, కెటిఆర్, ఎమ్మెల్సీ కవిత, సినీ నటులు మోహన్ బాబు, నాగాబాబు, కీరవాణి, మంచు మనోజ్, రచయిత పరుచూరి గోపాలకృష్ణ, డైరెక్టర్ కొదండరామ్, పలువురు కవులు, కళాకారులు, ఉద్యమ సంఘాలు గద్దర్ భౌతికకాయానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా.. పేద ప్రజల గొంతుకై చైతన్య రగిలించే అనేక పాటలు పాడి ప్రజలు గుండెల్లో చిరస్థాయి యిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. గద్దర్ లేనిలోటు తీర్చలేదని భావోద్వేగానికి లోనయ్యారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News