Sunday, January 19, 2025

బిఆర్‌ఎస్‌లో ‘మహా’పర్వం

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ పార్టీలోకి మహారాష్ట్ర నుంచి చేరికల జో రు కొనసాగుతోంది. నాందేడ్, కాందార్ లోహ వంటి తెలంగాణ సరిహద్దు ప్రాంతాల నుంచి మొదలైన ఈ చేరికల పర్వం, మధ్య మహారాష్ట్రకు చేరుకున్నది. ఈ మేరకు దిన దిన ప్రవర్ధమానమవుతూ మహా రాష్ట్రవ్యాప్తంగా బిఆర్‌ఎస్ విస్తరిస్తూ మరాఠా ప్రజల హృదయాల్లో పాగావేసుకుంటోం ది. జాతీయస్థాయిలో బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, సిఎం కెసిఆర్ నాయకత్వం పట్ల ప్రజాదరణ పెరుగుతున్నదనడానికి, మహారాష్ట్రలో కొనసాగుతున్న ఈ చేరికల పరంపర అద్దం పడుతున్నది. మహారాష్ట్రలోని పల్లె పల్లెకు విస్తరిస్తామన్న బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ లక్ష్యం త్వరలోనే సిద్ధించనున్నది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నాయకులు ఆదివారం ప్రగతిభవన్ బిఆర్‌ఎస్ అధినేత, సిఎం కెసిఆర్ సమక్షంలో గులాబీ కండువాలు కప్పుకొని బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు.

Also Read: మియాపూర్ లో బోర్డు తిప్పేసిన మరో రియల్ ఎస్టేట్ సంస్థ..

వారిలో మాజీ ఎంఎల్‌ఎ అన్నా సాహెబ్ మానె, సంతోష్ మానె, ప్రశాంత్ పాటిల్ ఉన్నారు.ఔరంగాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ శివసేన లీడర్, రెండు సార్లు ఎంఎల్‌ఎగా పని చేసిన సీనియర్ నేత అన్నా సాహెబ్ మానె.. బిఆర్‌ఎస్‌లో చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది. వారికి గులాబీ కండువా కప్పి అధినేత పార్టీలోకి ఆహ్వానించారు.వారితో పాటు, గంగాపూర్ నియోజక వర్గానికి చెందిన సంతోష్ కుమార్, ఔరంగాబాద్ ఎన్‌సిపి యూత్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్న ప్రశాంత్ పాటిల్ కూడా బిఆర్‌ఎస్‌లో చేరారు.
సంతోష్ కుమార్ ఎన్‌సిపి పార్టీ తరపున గంగాపూర్ నుంచి పోటీ చేయగా, ఆయన 82 వేల ఓట్లు సాధించారు. ఆదివారం బిఆర్‌ఎస్‌లో చేరిన నేత లు ఔరంగాబాద్ జిల్లా వ్యాప్తంగా రాజకీయంగా మంచి పట్టు, ప్రజల్లో ఆదరణ ఉన్న నేతలు కావడం గమనార్హం. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌ఎ, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News