Sunday, January 19, 2025

పెరుగుతున్న మద్దతు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ :పార్టీ ఆవిర్భావం అనంతరం రెండో రోజూ (గురువారం) ఢిల్లీలో బిఆర్‌ఎస్ అధినేత సిఎం కెసిఆర్‌కు శుభాకాంక్షల వెల్లువ కొనసాగింది. సందర్శకులు, ప్రజా ప్రతినిధుల తో రెండోరోజూ సిఎం బిజీబిజీగా గడిపారు. బిఆర్‌ఎస్ జాతీయ కార్యాలయ ప్రారంభం కోసం తెలంగాణ నుంచి వేలాది గా తరలివచ్చిన పార్టీ నేతలు కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులతో పాటు, ఉత్తరాది నుంచి వచ్చిన వం దలాది రైతు సంఘాల నేతలు ప్రముఖులతో సిఎం అధికారిక నివాసం తుగ్లక్ రోడ్ పరిసర ప్రాంతాలు జన సందోహంతో కిక్కిరిసి పోయాయి. తనను కలిసి శుభాకాంక్ష లు తెలపడానికి వచ్చిన ప్రతి అభిమాని, కా ర్యకర్తను పేరుపేరునా కెసిఆర్ పలకరించి వా రితో సిఎం ఫొటో దిగారు. టిఆర్‌ఎస్ పార్టీ బిఆర్‌ఎస్‌గా జాతీయపార్టీగా అవతరించిన నేపథ్యంలో, తమ అభిమాన నాయకుడిని క లిసి వారంతా శుభాకాంక్షలు తెలిపారు.

ఢిల్లీలో భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్) జా తీయ కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర స మితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును శాసనసభ స్పీకర్ పోచారం శ్రీ నివాస్‌రెడ్డితో పాటు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిలు సిఎం కెసిఆర్‌ను మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వీరితో పాటు పలువురు ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, గంప గోవర్ధన్, హన్మంత్‌షిండే పలువురు కార్పొరేషన్ చైర్మలు అనిల్ కుర్మాచలం, టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ గుప్తలు ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.తెలంగాణ జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ బిఆర్‌ఎస్ అధినేత, సిఎం కెసిఆర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

రాష్ట్ర పాలన ఇప్పటికే దేశానికి ఆదర్శంగా నిలిచిందని, తెలంగాణతో పాటు, దేశ ప్రజల ఆకాంక్షలు ప్రతిఫలించేలా, జాతీయ రాజకీయాలు, పాలనలో గుణాత్మక ప్రత్యామ్నాయం కోసం సిఎం కెసిఆర్ కృషికి తెలంగాణ జర్నలిస్టుల సంపూర్ణ మద్ధతు ఉంటుందని అల్లం నారాయణ స్పష్టం చేశారు. బిఆర్‌ఎస్ పార్టీకి తమ సంపూర్ణ మద్ధతు ఉంటుందని సీనియర్ తెలంగాణ అడ్వకేట్, ఉమ్మడి హైకోర్టు బార్ కౌన్సిల్ మాజీ చైర్మన్, తెలంగాణ అడ్వకేట్ జేఏసి అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి, అడ్వకేట్ జేఏసి నాయకులు రావుల వెంకట్‌రెడ్డిలు కెసిఆర్‌తో పేర్కొన్నారు. వారు బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు కెసిఆర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News