Thursday, December 26, 2024

“ పట్నం ”లో రాజకీయ వేడీ ….

- Advertisement -
- Advertisement -

ఇబ్రహీంపట్నం : ముందస్తు ఎన్నికలు వస్తాయని దీమాతో అన్ని పార్టీలు సమాయత్తమవుతున్నాయి. ఈ మద్యనే టిఆర్‌ఎస్‌గా ఉన్న పార్టీని నేడు బిఆర్‌ఎస్ పార్టీగా అవతరించడంతో ఆ పార్టీ శ్రేణులు మంచి ఊపు మీద ఉన్నారు. దేశంలో బిజెపి ప్రత్యామ్నాయం మేమె అంటు ప్రచారం చేసుకుంటు ముందుకు దూసుకపోతున్నారు. ముక్యంగా కారుకు కంచుకోటగా మారిన ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కనీస పట్టు కోసం కాంగ్రెస్, బిజెపి , ఇతర పార్టీలు జోరు పెంచాయి. గత ఎన్నికలకు ముందు ఇబ్రహీంపట్నంలో టిఆర్‌ఎస్‌కు కంచుకోటగా మారింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలకు ప్రజలు బ్రహ్మా రథం పడుతున్నారు.

అంతే కాకుండా కాంగ్రెస్ , బిజెపి, కమ్యూనిస్టులు తమ రాజకీయ అస్థిత్వం కాపాడుకోవడం కోసం అన్ని పార్టీలలో ఉన్న నేతలు పోరు బాట పట్టారు.అధికార పార్టీ జనంలో తమ పార్టీ మరింత పట్టును పెంచుకోవడంతో పాటు అభివృద్దిలో బాగాస్వాములైవుతున్నారు. ముఖ్యంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ప్రస్తుతం టిఆర్‌ఎస్‌ను తట్టుకొని గట్టిగా పోరాడే నాయకులు ప్రతిపక్ష పార్టీలలో కరువైనారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ ఏ చిన్న కార్యాక్రమం చేసిన టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు ,స్తానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డితో పాటు ఆయన తనయుడు మంచిరెడ్డి ప్రశాంత్‌రెడ్డి ( బంటి) ఉండి ప్రజలకు అవసరమైయ్యే పనులు చేపడుతుండడం కాస్తా ఆ పార్టీ ప్రజలలో బలమైనా నాయకత్వంతో పాటు ఊరూరా అధికార పార్టికి బలమైనా క్యాడర్ ఉంది.

ప్రతి పక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీప్ రేవంత్‌రెడ్డి రాకతో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కొంత ఊపిరి పోసినట్లు ఆ పార్టీ నేతలలో కదళిక వచ్చినప్పటికి ఆ పార్టీలో గ్రూపులతో సతమతమవుతున్నారు.వరంగల్‌లో జరిగిన సంఘర్షణ పోరు బాట సభతో మరింత దూకుడు పెంచిన కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ తో రాష్ట్రంలోనే అన్ని మండలాలలో రైతు రచ్చబండ కార్యాక్రమం చేసి ప్రజలకు వివరించడంలో సఫలీకృతమైనారని ఆ పార్టీ నేతలు చెప్పుకున్నారు. .దీంతో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మాత్రం గతం కంటె కాస్తా కాంగ్రెస్ మెరుగైందని చెప్పవచ్చు. ఇక బిజెపి విషయంలో కేవలం దేశంలో మోడీ చేపడుతున్న సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించే పనిలో పడ్డారు. కానీ సొంతంగా స్తానిక సమస్యల పరిష్కరించే విధంగా కృషి చేయకపోవడం బిజెపికి కొంత నష్టమేనని ఆ పార్టీ క్రింది స్థాయి నేతలు పెదవి విరుస్తున్నారు.

ఈ మద్య నే బండి సంజయ్ పాద యాత్రతో తుక్కుగూడ సభతో అమిషా ప్రసంగంతో కాస్తా కార్యకర్తలలో జోష్ తప్పా ఎక్కడ పది మంది ఆ పార్టీలో చేరిందిలేదు. అలాగె కమ్యూనిస్టులు సైతం ప్రజా సమస్యలపై పోరుబాట పట్టారు.ఈ మద్య మంచాల, యాచారం, ఇబ్రహీంపట్నం , అబ్దుల్లాపూర్ మెట్ లో ఇండ్ల స్థలాల విషయంలో రేషన్ కార్డుల తదితర సమస్యపై పెరు బాట పట్టారు. బలం పెంచుకోవాడానికి తీవ్ర కృషి చేస్తున్నారు. బిఎస్‌పి అధినేత డా: ఆర్‌ఎస్ ప్రవీన్ కుమార్ ఈ మద్యనే బాద్యతలు చేపట్టిన తరువాత ఇబ్రహీంపట్నంలో కాస్తా బీఎస్‌పీని గ్రామీణ ప్రాంతాలలో బలోపేతం చేయాలనే ఉద్ధెశంతో కేంద్ర ,రా్రష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేఖ విధానాలపై పోరు బాట పట్టినప్పటికి ప్రజలను సమీకరించడంలో విఫలమైనారనే విమర్శలు లేకపోలేదు.

ఏది ఏమైనప్పటికి అన్ని రాజకీయ పార్టీలు ముందస్తు ఎన్నికలు దేవుడెరుగు కానీ పార్టీలు మాత్రం ఎన్నికల భయంతో అన్ని పార్టీల నాయకులు సైతం రాజకీయ పదును పెట్టాయి.దీంతో అన్ని రాజకీయ పార్టీ అభ్యర్థులు మాత్రం నియోజకవర్గంలో ఎక్కడ విందులు వినోదాలు, పెండ్లీలు, , పేరంటాలు , ఏ చిన్న దావత్‌కు తెలిసిన తెలియక పోయిన క్రింది స్థాయి కార్యకర్తలు చెప్పిన సందర్బంలో డేగా లాగా వచ్చి వాలుతున్నారు. కొంత మంది పోటి చేసే అభ్యర్థులు అనారోగ్యంతో మృతి చెందిన , వివాహా వేడుకలకు , నూతన వస్త్రలంకరణ కార్యాక్రమానికి , పెండ్లీలకు పుస్తెను అందజేస్తు వాళ్ళకు తోచిన విధంగా ఆర్థిక సహాయం చేస్తు ఎన్నికల సమయంలో మా యందు దయచూసి ఓటేయ్యండని వేడుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News