Saturday, December 28, 2024

హైటెక్ ప్రచారం

- Advertisement -
- Advertisement -

సోషల్ మీడియాను బాగానే వాడుతున్న పార్టీలు
దుమ్ములేపుతున్న రీల్స్, షాట్ వీడియోస్

మన తెలంగాణ/కోహెడ : ఎన్నికల ప్రచారం గతంలో చాలా ఆర్భాటంగా ఉండేది. కానీ సోషల్ మీడియా పుణ్యమా, ఇటీవల కాలంలో గ్రామాల్లో వాట్సప్ గ్రూపుల సంఖ్య బాగా పెరిగిపోయింది. సామాజీక మాద్యమాల ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ ప్రచారం చేస్తున్నారు. పార్టీలలో చోటామోటా నాయకులు నుంచి మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు ఇలా అందరూ కూడా తమ పార్టీకి అనుకూలంగా ప్రచారం ముమ్మరం చేస్తున్నారు.

నాయకులు వారి అనుచరులు గ్రూపు అడ్మిన్లుగా ఉంటూ పార్టీల వారీగా గ్రామ, మండల, నియోజకవర్గస్థాయిలో విస్తృతంగా వాట్సప్ గ్రూపులను ఏర్పాటు చేసుకున్నారు. ఒక పార్టీలోని ఒక్కోక్క సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల ద్వారా వాట్సప్ గ్రూపులు ఏర్పడుతున్నాయి. ఎప్పటికప్పుడు ప్రచార కార్యక్రమాల వివరాలు, పోస్టులు పెడుతూ ప్రచారం చేస్తున్నారు. స్మార్ట్ ఫోన్‌ల వినియోగంతో గ్రామాల్లో హైటెక్ ప్రచారం ఊపందుకుంది.

ఇలా ప్రచారం చేస్తూ… వారి భవిష్యత్తు వ్యూహం ఎలా ఉంది అని.. వారు పెట్టిన పోస్టింగుకు వస్తున్న కామెంట్లు, లైక్‌లు, షేర్‌లతో ఒక అంచనాకు వస్తున్నారు. దేశంలో ఉన్న పార్టీలు కూడా ఫేస్‌బుక్, ఎక్స్ (ఒకప్పటి ట్విటర్), ఇన్‌స్ట్రాగ్రాం, వాట్సప్, యూటుబ్, వంటి సామాజిక మాద్యమాలను తమ పార్టీ ప్రచారానికి వాడుకుంటున్నారు. అయితే వీటిలో వాట్సప్ ఎక్కువ వాడుకలో ఉందని మనందరికి తెలుసు. నెటిజన్లు అడుగుతున్న ప్రశ్నలకు వెంటనే సమాధానాలు కూడా ఇస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News