Wednesday, January 22, 2025

ఆమోదించలేని అనాగరికం

- Advertisement -
- Advertisement -

‘భారత దేశ బహుళత్వ స్వభావాన్ని నిర్లక్ష్యం చేయడం ప్రభుత్వ వెర్రితనం. ఇలా ప్రతి చర్య దేశ గౌరవాన్ని తగ్గించేలా ఉంది’ అని నోబెల్ బహుమతి గ్రహీత అమర్త సేన్ అన్నారు. మతాధిక్యం, నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలు; సామాజిక, రాజకీయ రంగంలో మైనారిటీ వర్గాల పట్ల, ముఖ్యం గా ముస్లింల పట్ల వ్యవహరించే తప్పుడు విధానంపై అమర్త సేన్‌తో ఇటీవల ప్రముఖ జర్నలిస్టు కరణ్ థాపర్ చేసిన ఇంటర్వ్యూ.

కరణ్: గత నెల ఫ్రెంచి పత్రిక ‘లీమోండీ’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రపంచంలోనే అతి భయంకరమైనది?’ అని మీరన్నారు. ఈ నిర్ణయానికి రావడానికి గల కారణాలను వివరిస్తారా?

సేన్: దేశాన్ని పాలించే ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం సహాయం చేస్తుంది అన్నది ప్రశ్నార్ధకం. నరేంద్ర మోడీ ప్రభుత్వం భయంకరం కాకుండా ఎలా ఉంది? కరోనా మహమ్మారి సోకిన 2019లో ప్రభుత్వం ఉన్నట్టుండి అనేక పద్ధతులను అనుసరించింది. ప్రయాణాలను నిలిపివేయడంతో, ఉపాధి, ఉద్యోగాలు, జీవనోపాధి కోసం కాస్త సంపాదించుకోవడం, ఉన్న చోట తలదాచుకోవడానికి ఇల్లు వంటివన్నీ చాలా మంది కోల్పోయారు.

‘కరోనా వల్లనే మిమ్మల్ని ఇంటికి పరిమితం అవమని తీవ్రంగా ఒత్తిడి చేశాయాల్సి వచ్చింది’ అని చింతిస్తున్నట్టు ప్రభుత్వం చెప్పింది. ప్రజల్ని ఇళ్ళకే పరిమితం కమ్మనడం అసలు సమస్య కాదు. చాలా మందికి తలదాచుకోవడానికి అసలు ఇళ్ళే లేవు. ప్రజల జీవన స్థితి గతులను నాటకీయంగా తిరస్కరించడమే. చాలా మంది తమతమ గ్రామాలకు వెళ్ళడానికి వందల మైళ్ళు నడిచారు. కాస్త తిండికి సంపాదించుకోవడానికి కూడా చాలా మందికి కనీస ఆదాయం లేదు. ఈ రకమైన నిర్లక్ష్యాన్ని చూడడం కరోనా సమయంలో తీవ్ర వేదన కలిగించింది.

సేన్: ‘ముస్లింలపైన దాడి చేయడం, హిందువులు ఒక జాతిగా ఏర్పడాలని ప్రచారం చేయడం ద్వారా భారత ప్రభుత్వం మతతత్వంతో సంకుచితంగా తయారైంది’ అని లీమోండికి ఇచ్చిన ఇంటర్వ్యూల పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వం అధిక సంఖ్యాకుల, మతతత్వ దోరణి పట్ల ఎలా ఆందోళనగా ఉన్నారు?

సేన్: ఇది నాకు చాలా ఆందోళనగా ఉంది. బహుళ జాతుల దేశంగా, బహుళ మతాల దేశంగా భారత దేశం ఎప్పటి నుంచో ఉంది. క్రైస్తవులు భారత దేశానికి మూడవ శతాబ్దంలోనే వచ్చారు. యూదులు ఒకటవ శతాబ్దంలోనే వచ్చారు. వాయువ్య ప్రాంతాన్ని జయించడానికి ముందే ముస్లింలు, వ్యాపారులు వచ్చారు. ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునే విధానం భారత దేశ ప్రధాన లక్షణం. కలహాలు, జయించడాలు ఉన్నప్పటికీ, మన దేశం మౌలికంగా భిన్న మతాల, భిన్న జాతుల దేశంగా స్థిరపడింది. ఇది కేవలం సాధారణ జీవితానికి పరిమితం కాలేదు. ఇవి ఆర్థిక, రాజకీయ, సామాజిక సంబంధాలకు, కళలు, సామాజిక శాస్త్రాల సృష్టికి దోహదం చేశాయి. తాజ్‌మహల్ కేవలం హిందువుల నిర్మితం కాదు, అది విభిన్న సంస్కృతుల సమ్మిళిత దేశంగా అభివృద్ధి చెందింది. ఈ వాస్తవాలను తిరస్కరిస్తూ, ఏకపక్షంగా భారత్ హిందూ దేశమని, ఒకే జాతి ఉన్న దేశం అని భావించడం వల్ల దేశ స్థాయిని తగ్గిస్తుంది.

కరణ్: ‘అధిక సంఖ్యాకుల మత రాజకీయాలు దేశ స్థాయిని తగ్గిస్తుంది’ అని ఉద్వేగ భరితమైన మాట వాడారు. దీనికి సంబంధించి భారతదేశంలో కాందిశీకులుగా నివసిస్తున్న ముస్లింలను మినహాయిస్తూ తెచ్చిన పౌరసత్వ చట్టం గురించి, మంత్రులు, ముఖ్యమంత్రులు ముస్లింలను చెదపురుగులనడం, బాబరు సంతానమనడం, పాకిస్థాన్ వెళ్ళిపోండని కూడా అంటున్నారు. ఈ మాటలను మీరు ఎలా చూస్తారు?

సేన్: ఈ మాటలు భారత జాతిని అవమానించడాన్ని ప్రతిబింబిస్తాయి. భారత దేశానికి ఒక ప్రత్యేకమైన సాంస్కృతిక నిబంధనలున్నాయి. నేను చెప్పినట్టు ప్రత్యేకమైన సామాజిక, రాజకీయ, ఆర్థిక విధానాలున్నాయి. ఉన్నట్టుండి వీటన్నిటినీ తొలగించి హిందువులను మాత్రమే భారతీయులనడం ఘోరమైన తప్పిదం. మహాత్మా గాంధీ దేశ స్వాతంత్య్రం కోసం పోరాడాడంటే, ఆ స్వాతంత్య్రం హిందువుల కోసం, ముస్లింల కోసం, సిక్కుల కోసం, అందరి కోసం. ఉన్నట్టుండి దానిలో ఒక భాగాన్ని మార్చేసి, ముస్లింలు భారతదేశానికి సంబంధించిన వారు కాదు, పొరుగునున్న దేశానికి సంబంధించిన వారనడం భారతీయ స్వభావంలో ఒక ఘోరమైన గందరగోళం సృష్టించడానికే. ఒక యుద్ధ విపత్తు కానీ, సంక్షోభం కానీ ఏర్పడినప్పుడు హిందువుల, ముస్లిం లు, సిక్కులు ఇతరులు ఇదివరకటిలా ఉండాలి. దేశ బహుళత్వాన్ని నిర్లక్ష్యం చేస్తే దానికి మించిన భయంకరమైన మూర్ఖత్వం మరొకటి ఉండదు.

కరణ్: బహుళత్వాన్ని తిరస్కరించడం భయంకరమైన మూర్ఖత్వం అంటున్నారు. ముస్లింలను మినహాయించాలని బిజెపి భావిస్తోంది. 2014లో కానీ, 2019లో కాని లోక్‌సభలో వారికి ముస్లింలు లేరు. పార్లమెంటు ఉభయ సభల్లోదేనిలో కానీ, గుజరాత్ శాసన సభలో కానీ వారికి ముస్లింలు లేరు. లోక్ సభకు కాని, విధాన సభకు కాని జరిగిన ఎన్నికల్లో 1998 నుంచి బిజెపి ముస్లింలకు టికెట్లు ఇవ్వలేదు. గుజరాత్‌లో ముస్లింలు 9 శాతం ఉన్నప్పటికీ పావు శతాబ్దంగా ముస్లింలను మినహాయిస్తున్నారు. జనాభాలో ఇరవై కోట్ల మంది ముస్లింలు, వారి వాటా 15 శాతం ఉన్న భారత దేశంలో అధికార పార్టీని మీరెలా అర్థం చేసుకుంటారు?

సేన్: మనం ఏదైతో చూస్తున్నామో అది ఆమోదయోగ్యం కాని అనాగరికమైన విధా నం. ‘అనాగరీకం’ అన్న మాట ఎందుకు వాడుతున్నానంటే, ప్రజల జీవితాలు పూర్తి గా ప్రమాదంలో పడిపోవడమే కాకుండా, భారత దేశ సంస్కృతిని కుదించారు కనుక. భారతీయులు సంగీతం, చిత్ర లేఖనాలను చూస్తే అవి హిందువులు, ముస్లింల సృష్టి. తాజ్‌మహల్‌ను చూస్తే మనం దానిలో రెండు విషయాలు అర్థమవుతాయి. హిందువులతో కలిసి ముస్లింలు నిర్మించిన గొప్పవాస్తు సృష్టి. రాకుమారుడు మొహమ్మద్ ఖుర్రం సతీమణి ముంతాజ్ స్మృతి చిహ్నంగా దీన్ని నిర్మించారు. ముంతాజ్ కుమారుడు దారాషికోర్ సంస్కృతం నుంచి పర్షియా భాషలోకి హిందూ రచనలైన ఉపనిషత్తులను తొలిసారిగా అనువదించిన వ్యక్తి. పర్షియా భాషనుంచే అవి ఇంగ్లీషు, జర్మన్, ఫ్రెంచి భాషలోకి అనువాదమయ్యాయి. ముంతాజ్ ఒక పక్క హిందూ ముస్లిం సమైక్య సంస్కృతుల కు తల్లి కాగా, మరొక పక్క మొఘల్ రాజుకు పట్టమహిషిగా ఒక ఉన్నతమైన స్థానంలో నిలుచుంది. అది భారతదేశమంటే. మనకు కలిసి ఉన్న సుదీర్ఘమైన చరిత్ర ఉండగా, ఆ స్థానంలో ముస్లింలకు వారికున్న గౌరవాన్ని, వారి పాత్రను, ఒక్కొక్కసారి భద్రతను ఇవ్వకుండా, వేరు పరచడం వల్ల ఈ దేశవాసులమైనామని బాధపడేలా చేస్తున్నారు. ముస్లిం లు ఇబ్బందుల పడే పరిస్థితుల నుంచి తొలగించకపోవడం కచ్చితంగా అసహ్యకరమైనదే.

కరణ్: సహజంగా ముస్లింలపైన ‘లవ్ జిహాది’, ‘గోహంతకులు’ అన్న ఆరోపణలు మోపుతున్నారు. వారి మారణ హోమానికి బహిరంగంగా పిలుపునిస్తున్నారు. నేరస్థులు కాకుండా కేవలం నిందితులైనంత మాత్రాన దేశ వ్యాపితంగా అధికారులే వారి ఇళ్ళను ధ్వంసం చేస్తున్నారు. ఆధ్వంసం కూడా చట్టప్రకారం చేయడం లేదు. దేశంలో ముస్లింల వ్యతిరేకత పెరుగుతోందని, వారిని రెండవ శ్రేణిపౌరులుగా దిగజార్చడానికి ప్రయత్నిస్తున్నారని ఏమైన ఆవేదన చెందుతున్నారా?

సేన్: ఆవేదన కాదు, భయపడుతున్నాను. విభిన్న భావాల కలయిగా ఉన్న భారత దేశం ఉన్నట్టుండి విపత్తులో పడిపోతూ ఏకాకి కావడం పట్ల భయపడుతున్నాను. మనం నివసిస్తున్న దేశంలో ఒక వర్గంవారు ఉన్నట్టుండి ఈ దేశంలో భాగం కాదంటే, ఈ విపత్తును జాతీయ విపత్తుగా భావిస్తున్నాను. ముస్లింలను మినహాయిస్తే, ఈ దేశ సంస్కృతిని అర్థం చేసుకోవడంలో భాగస్వాములు కారు.ఈ సమాజ సంస్కృతిలో, రాజకీయా ల్లో భాగం కాకపోతే, ఆ విషయం ఎందుకనే దానికి మినహాయింపు కాదు. ఇది భయంకరమైన బలమైన దుష్టత్వం. అది ఈ దేశాన్ని ఏదో ఒక రోజు ఏకాకిని చేస్తుంది. బిజెపి నాయకత్వంలో హిందూ పరిపాలన, ప్రస్తుత భారత దేశంలో మనకున్న నాయకత్వం తయారు చేస్తున్న ఈ ఏకాకితనం అనేది భయంకరమైన మూర్ఖత్వం. దాని స్థానం నుంచి నిష్ర్కమించడానికి ఒక పరిస్థితిని కల్పించడం. ఒకవేళ వారిని వెళ్ళిపొమ్మని చెప్పడానికి ఒక జాతిపిత ఉన్నట్టుండి నిర్ణయించినట్టయితే, వాళ్ళు వెళ్ళిపోమని భీష్మిచుకు కూర్చుంటే, నాయకులే వారిని తరిమేసేటట్టున్నారు.

రాఘవశర్మ
9493226180

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News