Sunday, February 23, 2025

నెల్లూరు వైసిపిలో వర్గవిభేదాలు… అనిల్ వర్సెస్ కాకాణి

- Advertisement -
- Advertisement -

 

అమరావతి: నెల్లూరు జిల్లాలో వైసిపి రాజకీయం వేడెక్కుతుంది. కాకాణి, మాజీ మంత్రి అనిల్ మధ్య వివాదం ముదురుతోంది. రేపు నెల్లూరు జిల్లా మంత్రి కాకాణి రానున్న నేపథ్యంలో ఉద్రిక్తత పరిస్థితిలు నెలకొంటాయి. మంత్రి కాకాణిపై మాజీ మంత్రి అనిల్ వెనక్కి తగ్గే అవకాశాలు లేవు. సభను నిర్వహించి తీరుతామని మాజీ మంత్రి అనిల్ తెలిపారు. నియోజకవర్గం నుంచి మాత్రమే కార్యకర్తలు హాజరవుతారని స్పష్టం చేశారు. ఇది ఎవరికీ పోటీ సభకాదని మాజీ మంత్రి అనిల్ తెలిపారు. మూడు రోజుల ముందే సభకు అనుమతి తీసుకున్నామని, సిఎం జగన్ మోహన్ రెడ్డికి సైనికుడిగానే పని చేస్తానని, సభ వాయిదా వేసుకోవాలని అధిష్టానం సూచించలేదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News