Saturday, November 23, 2024

రాజకీయ మల్లయోధుడు ‘ములాయం’ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

అనారోగ్యంతో గురుగ్రామ్ మేదాంత ఆస్పత్రిలో తుదిశ్వాస

నేడు 3గంటలకు అంత్యక్రియలు,
హాజరు ప్రముఖులు రాష్ట్రపతి, ప్రధాని సహా
ప్రముఖుల సంతాపం యూపీ సిఎంగా, కేంద్ర రక్షణ
మంత్రిగా యూపీలో రోజులు సంతాప దినాలు

గురుగ్రామ్/న్యూఢిల్లీ/లక్నో : సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, రాజకీయ దిగ్గజం, మల్లయోధుడు, ఉత్తర్‌ప్రదేశ్ మా జీ ముఖ్యమంత్రి, యూపీ వాసులు ‘నేతాజీ’ అని ముద్దుగా పిలుచుకునే ములాయం సింగ్ యాద వ్ (82) విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రిలో ఈ నెల 2 నుంచి చికిత్స తీసుకుంటున్నారు. ఆరోగ్యం మరింత క్షీణించడంతో సోమవారంనాడు ఉదయం కన్నుమూశారు. ములాయం మరణవార్తను కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ స్వయం గా ట్విట్టర్‌లో వెల్లడించారు. ‘నా తండ్రి, మీ నే తాజీ ఇక లేరు’ అని పేర్కొన్నారు. ములాయం అంత్యక్రియలు బుధవారం సాయంత్రం 3 గం టలకు సొంత గ్రామం సైఫాయిలో నిర్వహించనున్నారు. అధికార లాంఛనాలతో అంతిమ సం స్కారాలు చేపట్టాలని యూపీ సిఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు. మూడు రోజుల పాటు రాష్ట్రంలో సంతాప దినాలు పా టించాలని సూచించారు.

సోమవారం సాయంత్రంకల్లా ములాయం పార్థీవదేహాన్ని సై పాయి గ్రామానికి తరలించారు. అభిమానుల సందర్శనార్థం సైఫాయి మేళాలో మృతదేహాన్ని ఉంచా రు. ములాయం మృతదేహాంతో పాటు అఖిలేష్ వచ్చారు. విషాదంలో మునిగిపోయిన అఖిలేష్ ను ఆయన బాబాయి శివపాల్ యాదవ్ భుజం పై చేయి వేసి ఓదార్చారు. ములాయం మృతికి రాష్ట్రపతి, ఉప ప్రధాని, కేంద్ర మంత్రు లు, ఆయా రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు తదితర ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయ న సేవలను కొనియాడారు. ములాయం మృతితో సమాజ్‌వాదీ పార్టీ శ్రేణుల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. యూపీలో ఎక్కడ చూసిన ఆయన చిత్ర పటాల ముందు ప్రజలు నివాళి అర్పించడమే కనిపిస్తోంది. ములాయం మరణవార్త తెలిసిన వెంటనే ఎస్‌పి శ్రేణులు వేలాదిగా లక్నోలోని పార్టీ ఆఫీసుకు తరలివచ్చారు. నాయకులు, కార్యకర్తలు నేతాజీ అమర్ రహే అంటూ నినదించారు. ములాయం మృతికి సంతాపసూచకంగా ఎస్‌పి కార్యాలయాల్లో పార్టీ జెండాను అవనతం చేశారు.

రైతు కుటుంబంలో పుట్టి.. రాజకీయ ప్రావీణ్యం

ములాయం సింగ్ యాదవ్ నవంబర్ 22న 1939 సంవత్సరంలో యూపీలోని సైఫాయి సమీప ఎటావాలోని ఓ రైతు కుటుంబంలో జన్మించారు. ములాయం రాజకీయ రంగ ప్రవేశానికి ముందు ఉపాధ్యాయుడిగా కూడా సేవలందించారు. కొన్నాళ్ల తర్వాత టీచర్ వృత్తిని వదిలి రాజకీయాల్లోకి వచ్చారు. సోషలిస్టు నాయకుడు రాంమనోహర్ లోహియా స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చిన ములాయం 1960లో జనతాదళ్‌లో చేరారు. 1967లో శాసనసభ్యుడిగా గెలుపొందారు. ఎమర్జెన్సీ సమయంలో 19 మాసాల పాటు జైలు జీవితం గడిపారు. 1977లో మంత్రి అయ్యారు. 1985లో జనతాదళ్‌లో చీలిక రావడంతో చంద్రశేఖర్, సిపిఐలతో కలిసి క్రాంతికారి మోర్చాను స్థాపించారు. దీని ద్వారానే 1989లో తొలిసారి సిఎం అయ్యారు. అంతకుముందు శాసన సభ, మండలిలో విపక్ష నేతగా కూడా ఆయా సందర్భాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. 1990లో వి.పి.సింగ్ సర్కార్ కుప్పకూలడంతో ములాయం, చంద్రశేఖర్ జనతాదళ్(సోషలిస్టు)లో చేరారు.

1991లో కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించడంతో యూపీలో ప్రభుత్వం కూలిపోయింది. దాంతో ములాయం సొంతంగా 1992లో సమాజ్‌వాదీ పార్టీని స్థాపించారు. తనకు అత్యంత ఇష్టమైన సైకిల్‌నే ఎన్నికల గుర్తుగా ఎంచుకుని తన రాజకీయ జీవితంలో 10 సార్లు శాసనసభ్యుడిగా, 7 సార్లు ఎంపిగా విజయం సాధించారు. ఆయన కంచుకోటలు మైన్‌పురి, ఆజాంగఢ్ నియోజకవర్గాలు. ములాయం కేంద్ర రక్షణశాఖ మంత్రిగా 1996-98 మధ్య కాలంలో పనిచేశారు. మూడు సార్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూడా సేవలందించారు. దేశ రాజకీయాల్లో సుదీర్ఘ కాలం పాటు పార్లమెంటేరియన్‌గా ములాయం ఒక వెలుగు వెలిగారు. దశాబ్దాల పాటు జాతీయ స్థాయి నేతగా కీలక పాత్ర పోషించారు. యూపీలో క్రమంగా ప్రజలందరి మనస్సులో చోటు సంపాదించుకుని ‘నేతాజీ’గా ముద్ర వేసుకున్నారు. తుదిశ్వాస వరకు మైన్‌పురి ఎంపిగా కొనసాగారు. ఒకానొక సందర్భంలో ప్రధానమంత్రి అయ్యే అవకాశాన్ని ములాయం తృటిలో కోల్పోయారు.

మల్ల యోధుడిగా ములాయం…

ములాయం యాదవ్‌కు చిన్ననాటి నుంచి కుస్తీ పోటీలపై మక్కువ ఉండేది. మైన్‌పురిలో ఓ సారి పోటీల్లో పాల్గొన్నారు. దానికి అక్కడి ఎంఎల్‌ఎ ముఖ్య అతిగా హాజరయ్యారు. ములాయం కుస్తీ పట్లకు అబ్బురపడిన శాసనసభ్యుడు నాథూ సింగ్ ప్రశంసలు కురిపించారు. చుట్టుపక్కల ఏరియాలో ములాయంకు ఉన్న పాపులారీటిని కూడా గమనించిన ఆయన జశ్వంత్ నగర్ నుంచి ఎంఎల్‌ఎగా బరిలోకి దింపాలని ప్రయత్నాలు చేశారు. కానీ అది కుదరలేదు. కుస్తీ పోటీల్లో ములాయం సింగ్‌కు ఉన్న పట్టుదలను చూసిన స్థానికులు ఆయనను పహిల్వాన్ అని కూడా పిలుచుకుంటారు.

రెండో పెళ్లి ఓ మిస్టరీ…

ములాయంకు ఓ సోదరితో పాటు శివపాల్, రతన్ సింగ్, అభయ్ రామ్, రాజ్‌పాల్ అనే సోదరులు ఉన్నారు. దగ్గరి బంధువు రాంగోపాల్ యాదవ్ కూడా రాజకీయ రంగంలో ఉన్నారు. ములాయం రెండు వివాహాలు చేసుకున్నారు. తొలుత మాలతీదేవిని వివాహమాడారు. వీరికి అఖిలేష్ యాదవ్ జన్మించారు. దీర్ఘకాలిక ఆనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆమె 2003లో కన్నుమూశారు. మాలతీదేవి బతికుండగానే సాధనా గుప్తా అనే మహిళతో ములాయం సహజీవనం చేశారు. వీళ్లకు ప్రతీక్ యాదవ్ అనే కుమారుడు కూడా ఉన్నారు. 2007లో ములాయం స్వయంగా ప్రకటించే వరకు సాధనా గుప్తాను పెళ్లి చేసుకున్న విషయం ఎవరికీ తెలియదు. 2022లో సాధనా గుప్తా కన్నుమూశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News