ఎంపిల ఉరుకులు పరుగులు
మాడ్రిడ్ : స్పెయిన్ దేశంలోని అండలూసియా పార్లమెంట్‌లో ఓ ఎలుక హల్‌చల్ చేసింది. సమావేశాల్లో భాగంగా కీలక ఓటింగ్ నిర్వహిస్తున్న దశలో ఎవరు ఊహించని విధంగా టేబుల్‌పైకి చేరిన ఎలుక అక్కడి ఎంపిలను ఉరుకులు పరుగులు పెట్టించింది. దీనికి సంబంధించిన వీడియోను రాయిటర్స్ సంస్థ ట్విటర్‌లో షేర్ చేసింది. కొన్ని రోజులుగా పెండింగ్‌లో పడిపోయిన ఒక ముఖ్యమైన తీర్మానంపై బుధవారం ఎంపిలు ఓటింగ్ ప్రక్రియను చేపట్టారు. ఓటింగ్‌కు సంబంధించి స్పీక్ మార్తా బోస్కెట్ సీరియ్స్‌గా మాట్లాడుతున్నారు. ఇంతలో ఒక ఎలుక ఎంపిలు కూర్చున్న టేబుల్‌పైకి ఎక్కింది. దానిని చూసిన స్పీకర్ షాక్ తిన్నారు. ఏమైందో అని మిగతా సభ్యులు కూడా అటు ఇటూ చూశారు. ఇంతలో ఎలుక పరిగెత్తడం చూసి కొంతమంది ఎంపిలు ఉరుకులు పరుగులు పెట్టగా.. మరికొందరు టేబుళ్లపైకి ఎక్కడానికి ప్రయత్నించారు. చివరకు ఎలాగోలా తంటాలు పడి ఎలుకను బయటికి పంపారు.
This is the moment when a rat causes havoc in Andalusia's parliament in Spain 🐀 pic.twitter.com/PypFRWvQfQ
— Reuters (@Reuters) July 21, 2021