Monday, December 23, 2024

ఓటర్ల సవరణ సర్వే రాజకీయ నాయకులు సహకరించాలి

- Advertisement -
- Advertisement -

కామారెడ్డి ప్రతినిధి : ఇంటింటికి బిఎల్వోలు వెళ్లి ఓటర్ల సవరణ సర్వే నిర్వహిస్తున్నారని వారికి రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో గురువారం రాజకీయ పార్టీల నాయకులతో ఓటర్ల జాబితాల సవరణపై సమీక్ష నిర్వహించారు. 2023 సెప్టెంబర్ 30 నాటికి 18 ఏళ్లు నిండిన యువతి యువకులు ఓటు హక్కు కోసం బిఎవఓ లకు దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. నోడల్ అధికారులు ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు విధులు నిర్వర్తించాలని పేర్కొన్నారు. సమావేశంలో ఎన్నికల విభాగం అధికారి సాయి భుజంగరావు, నోడల్ అధికారులు, రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News