Tuesday, January 21, 2025

ఖమ్మం జిల్లాలో వేడెక్కుతున్న రాజకీయాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎన్నికల వేళ ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలు ఖమ్మం జిల్లాను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఈ జిల్లా ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాఫిక్‌గా మారింది. ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎంపి పొంగులేటి ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరడంతో ఫుల్‌జోష్‌లో ఉన్న ఆ పార్టీ త్వరలోనే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును పార్టీలోకి తీసుకురావాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలోనే శనివారం ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రావు తుమ్మల ఇంటికి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీలోకి రావాలని తుమ్మలను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆహ్వానించారు. తుమ్మల, పొంగులేటి భేటీతో రాజకీయంగా ఉత్కంఠ నెలకొంది. తుమ్మల ఇంటి వద్ద పెద్ద ఎత్తున చేరుకున్న కార్యకర్తలతో కోలాహలంగా ఉంది.
అభిమానులతో చర్చించి నిర్ణయం తీసుకుంటా: తుమ్మల
ఈ సందర్భంగా తుమ్మల మీడియాతో మాట్లాడుతూ పార్టీలోకి రావాలని ఆహ్వానించేందుకు వచ్చిన పొంగులేటికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. తన స్వార్ధం, నా కుటుంబం కోసం తాను ఏ పని చేయనన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కంటే ఖమ్మం జిల్లాను ఎక్కువగా అభివృద్ధి చేశానని ఆయన తెలిపారు. ఇక, పార్టీ మార్పు అనుచరులు, అభిమానులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానన్నారు. అభిమానుల అభిప్రాయానికి అనుగుణంగా నడుస్తానని తుమ్మల పేర్కొన్నారు.
తుమ్మల రాకకోసం కాంగ్రెస్ ఎదురుచూపు: పొంగులేటి
కాంగ్రెస్ పార్టీలోకి తుమ్మల రావాలని పొంగులేటి ఆహ్వానం పలికారు. తుమ్మల రాక కోసం కాంగ్రెస్ పార్టీ ఎదురుచూస్తోందని పొంగులేటి పేర్కొన్నారు. గతంలో ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశ్యంతో తనను, పువ్వాడ అజయ్‌కుమార్‌ను తుమ్మల బిఆర్‌ఎస్‌లోకి తీసుకెళ్లారని పొంగులేటి గుర్తుచేశారు. ప్రస్తుతంం తుమ్మల, అతని అనుచరగణమంతా కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానం పలికినట్లు పొంగులేటి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News