Wednesday, January 22, 2025

మంథనిలో వేడెక్కుతున్న రాజకీయం

- Advertisement -
- Advertisement -

మల్హర్: మంథని నియోజకవర్గం దేశంలో, రాష్ట్రంలో రాజకీయంగా పేరు పొందిన ఘనత మంథని నియోజకవర్గానికి ఉంది. దేశ ప్రధానిగా పివి నర్సింహరావు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసన సభ స్పీకర్‌గా దుద్దిళ్ల శ్రీపాదరావులు, మంత్రిగా శ్రీధర్‌బాబు ప్రాతినిత్యం వహించినది మంథని నియోజకవర్గం. 1957 నుండి ఇప్పటి వరకు 15 సార్లు జరిగిన శాసన సభ ఎన్నికల్లో పివి నర్సింహరావు, సి నారాయణరెడ్డి, శ్రీరాం, శ్రీపాదరావు, రాంరెడ్డి, శ్రీధర్‌బాబు, పుట్టమధు ఎంఎల్‌లుగా ప్రాతినిత్యం వహించారు. ప్రస్తుతం 9 మండలాలు 2,03,387 మంది ఒటర్లు గల నియోజకవర్గం మంథని.
ఎన్నికలు సమయం సమీపిస్తున్న వేల నియోజకర్గంలో పోటీ చేయనున్న ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు, టిక్కెటు ఆశిస్తున్న అభ్యర్థులు పోటా పోటీగా పరామర్శలు, పాడెలు మోయడం, పైసలు పంచడం అనే ట్రిబుల్ పి కార్యక్రమాలు చేపడుతూ నియోజకవర్గ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఎఐసిసి కార్యదర్శిగా, నియోజకరవ్గంలో సిట్టింగ్ ఎంఎల్‌ఎగా శ్రీధర్‌బాబు బాధ్యతలు నిర్వహిస్తూ, అతడు, అతని సోదరుడు శ్రీనుబాబు కాంగ్రెస్ పార్టీ తరుపున నియోజకవర్గంలో తమ కార్యకర్తలతో కలిసి శుభకార్యాలయాల్లో పాల్గోంటూ, బాధిత కుటుంబాలను కలుస్తూ, అండగా ఉంటామని తెలుపుతూ నియోజకరవ్గంలో తిరుగుతూ ప్రజలకు మరింత చేరువయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. నియోజకవర్గంలో మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి, ప్రతిపక్షంలో ఉంటూ నియోజకవర్గ సమస్యలు శాసనసభ దృష్టికి తీసుకెల్తూ చేస్తున్న కృషి మల్లి గెలిపిస్తుందని ధీమాతో ప్రజలకు చేరువయ్యే కార్యక్రమాలు చేస్తున్నారు.
ఎంఎల్‌ఎగా ప్రజారాజ్యం నుండి ఒకసారి పోటీ చేసి ఓటమి పాలై, రెండో సారి బిఆర్ఎస్ తరుపున పోటీ చేసి ఎంఎల్‌ఎగా గెలిచి సేవలు అందించిన పుట్ట మధు తదుపరి ఎన్నికల్లో ఎంఎల్‌ఎగా ఓటమి చెంది బిఆర్ఎస్ అధిష్టానం గుర్తింపుతో పెద్దపల్లి జిల్లా జెడ్‌పి చైర్మెన్‌గా బాధ్యతలు స్వీకరించి అటు జిల్లాకు సేవలందిస్తూ ఇటు నియోజకవర్గ బిఆర్‌ఎస్ ఇంచార్జిగా, అధికారపార్టీ బాధ్యులుగా నియోజకరవ్గం చుట్టుముడుతూ తన బార్య మున్సిపల్ చైర్‌పర్సన్ పుట్ట శైలజతో కలిసి మృతుల కుటుంబాలను, ఇతర బాధిత కుటుంబాలను పరామర్శిస్తూ, బిఆర్‌ఎస్ పార్టీ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు అమలయ్యే విదంగా చూస్తూ నియోజకవర్గ ప్రజలు వద్ద మరింత మంచి పేరు పొందేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

బహుజనవాదంతో ముందుకెల్తూ అందరిని ఏకంచేసే ప్రయత్నం చేస్తు, మహానీయులు చరిత్రలను ప్రచారం చేస్తూ వారి విగ్రహాలను నెలకొల్పుతున్నారు. ఎలాగైనా ఈసారి ఎంఎల్‌ఎగా గెలువాలనే తాపత్రయంతో పనిచేస్తున్నారు.
బిజెపి పార్టీ టికెట్ ఆశిస్తున్న మాజీ ఎంఎల్‌ఎ చందుపట్ల రాంరెడ్డి తనయుడు సునీల్‌రెడ్డి నియోజకరవ్గంలో పార్టీ బలోపేతానికి పాదయాత్రలు చేస్తూ, పరామర్శలు, బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం చేస్తూ ప్రజల ఆదరణ పొందేలా గెలుపే లక్షంగా నియోజకవర్గంలో నిత్యం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
కాటారం మండలం దన్వాడకు చెందిన చల్ల నారాయణరెడ్డి పిఎసిఎస్ చైర్మెన్‌గా, బిఆర్‌ఎస్ పార్టీ నాయకుగా ప్రస్తుతం కొనసాగుతున్నారు. సీనియర్ నాయకులైన నారాయణరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చాలాకాలం పనిచేసి వివద పదవులు నిర్వహించారు. మొదటి సర్పంచిగా, మార్కెట్ కమిటి చైర్మెన్‌గా,సింగల్‌విండో చైర్మెన్‌గా, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, జెడ్‌పిటిసి లాంటి పదవులు నిర్వహించారు. రిజర్వేషన్ కలిసి రాకపోవడంతో బార్య సుజాతను పోటీ చేయించి రెండు సార్లు దన్వాడ సర్పంచిగా, ఎంపిపి పదవిని గెలుచుకున్నారు. ఇటీవల బిఆర్‌ఎస్ పార్టీ మంత్రులకు, ముఖ్యమంత్రికి, పులువురి ఎంఎల్‌ఎలను కలుస్తూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గోంటూ చురుకుగా ముందు కెల్తున్నారు. పార్టీ అదిష్టానం ఆదేశిస్తే ఎంఎల్‌ఎగా పోటీచేస్తానని పలు సందర్బాల్లో వాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News