Thursday, April 3, 2025

రాజకీయాలు నాకు ఫుల్‌టైమ్ జాబ్ కాదు:యోగి ఆదిత్యనాథ్

- Advertisement -
- Advertisement -

ప్రధాని నరేంద్రమోడీ వారసత్వం గురించి మహారాష్ట్ర అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదాలు జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన రాజకీయ జీవితంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ నేను రాష్ట్రానికి ముఖ్యమంత్రిని. పార్టీ నన్ను యూపీ ప్రజల కోసం నియమించింది.న అందుకే రాష్ట్రాభివృద్ధి కోసం పనిచేస్తున్నాను. ఇక పాలిటిక్స్ నాకు ఫుల్‌టైమ్ జాబ్ కాదు.వాస్తవానికి నేను ఒక యోగిని.’ అని ఆయన పేర్కొన్నారు. ప్రతిపనికి ఒక కాలపరిమితి ఉంటుందని, అదే విధంగా తన రాజకీయ జీవితానికి కూడా పరిమితి ఉంటుందని అన్నారు. జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ హైకమాండ్‌తో తనకు విభేదాలు ఉన్నాయని వస్తున్న వార్తలను యోగి ఖండించారు.

పార్టీ ఇచ్చిన అవకాశం వల్లే ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నానని, పార్టీ పెద్దలతో విభేదాలు ఉంటే ముఖ్యమంత్రి స్థానంలో కొనసాగేవాడిని కాదని అన్నారు. ఎవరో ఒకరు తప్పుడు ప్రచారాలు చేస్తూనే ఉంటారని, వాటిని తాను పట్టించుకోనని స్పష్టం చేశారు. ముస్లింలు హిందూయిజం నుంచి ఎంతో నేర్చుకోవాల్సిన అవసరం ఉందని, ముఖ్యంగా క్రమశిక్షణను అలవరచుకోవాలని సూచించారు. దేశ రాజకీయ నాయకత్వంలో ఆరెస్సెస్ మార్పు కోరుకుంటోందని, మోడీ వారసుడు మహారాష్ట్ర నుంచే వస్తాడని శివసేన (యూబీటీ ) నేత సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కొట్టివేయగా, ఈ నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్ మాటలు ప్రాధాన్యంసంతరించుకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News