Monday, December 23, 2024

బిఆర్‌ఎస్‌లో వారసత్వ రాజకీయాలు : బండి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో వారసత్వ రాజకీయాలను సిఎం ప్రోత్సహిస్తున్నారని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఆరోపించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ నిజామాబాద్‌లో తన కూతురు పట్టు కోల్పోకుండా చూసుకోవడం కోసమే కామారెడ్డిలో కెసిఆర్ విఫల యత్నం చేస్తున్నారని విమర్శించారు.

తన గెలుపుపై నమ్మకం ఉన్న సిఎం రెండు స్థానాల్లో పోటీ చేసి మరొక చోట ఉప ఎన్ని కలను ఎందుకు కోరుకుంటున్నారని ప్రశ్నించారు. ఇది ప్రజాధనాన్ని వృథా చేయడమే అని మండిపడ్డారు. కంటోన్మెంట్, కోరుట్ల టికెట్లును ఎమ్మెల్యే వారసులకు ఇవ్వడంతో కెసిఆర్ వారసత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు నుంచి దృష్టి మళ్లించేందుకే మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల పేరుతో కవిత నిరసనలు చేసిందని ఆరోపించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News