Monday, November 25, 2024

ప్రచారానికి తెర

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా సార్వత్రిక ఎ న్నిక ల ప్రచారం ముగిసింది. గత నెల రోజులుగా సాగుతున్న ప్రచారానికి శనివారం బ్రేక్ పడింది. మైక్‌లు బంద్ అయ్యాయి. ఎన్నికల కు 48 గంటల ముందు సాయంత్రం 6 గంటలకు ప్ర చారం ము గించాలన్న ఇసి ఆదేశాల మేరకు, అన్ని రాజకీయ పార్టీలు ప్రచారం ముగించాయి. రాష్ట్రంలో 144 సెక్షన్ విధించారు. సోమవారం(మే 13) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పో లింగ్ జరుగనుండగా, వచ్చేనెల 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. రా ష్ట్రంలో 17 లోక్‌సభ స్థానాల బరిలో 525 మంది అభ్యర్థులు ఉన్నా రు.51 మంది మహిళా అభ్యర్థులు పోటీలో ఉన్నారు. రాష్ట్రవ్యాప్తం గా 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో 35,809 పోలింగ్ కేంద్రాల్లో 1, 09,941 ఇవిఎం యూనిట్లు సిద్ధం చేశారు. దీంతో పాటు సికింద్రా బాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు కూడా ఇసి ఏర్పాట్లు చే సింది. లోక్‌సభ ఎన్నికల్లో అన్ని స్థానాలకు కాంగ్రెస్, బిజెపి, బిఆర్‌ఎస్ పోటీ చేస్తున్నాయి. అగ్రనేతలు, ముఖ్యనేతలతో పార్టీలు విస్తృ త ప్రచారం నిర్వహించాయి.

కార్నర్ మీటింగ్‌లు, రోడ్‌షోలు, బహిరంగ సభల్లో విస్తృతంగా ప్రచారాన్ని హో రెత్తించాయి. ప్రచార గడువు సాయంత్రంతో ముగియడంతో స్థానికేతరు లు జిల్లాల నుంచి వెళ్లిపోవాలని అధికార యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. సమస్యాత్మక ప్రాంతాలైన ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని 14 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో, సాయంత్రం 4 గంటలకే ఎన్నికల ప్రచారం ముగిసింది. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని సిర్పూర్, ఆసిఫాబాద్ సెగ్మెంట్ పరిధిలో ప్రచారానికి బ్రేక్ పడింది. పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని, వరంగల్ నియోజకవర్గంలోని భూపాలపల్లి, మహబూబాబాద్ పరిధిలోని ములుగు, పినపాక, ఇల్లందు, భద్రాచలం, ఖమ్మం పరిధిలోని కొత్తగూడెం, అశ్వారావుపేట అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో సాయంత్రం 4 గంటలకే ప్రచారనికి తెరపడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News