భోపాల్ : మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు రెండుమూడు రోజుల్లో జరగనుండగా, బాలాఘాట్ అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్ సస్పెన్షన్ కు గురయ్యారు. సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ గోపాల్ కుమార్ సోనీ రిటర్నింగ్ ఆఫీసర్‌గా పోలింగ్ రోజున బాధ్యతలు నిర్వహించారు. అయితే ట్రజరీ గది నుంచి పోస్టల్ బ్యాలెట్లను తీసి విభజించారని ఆరోపణలు రావడంతో జిల్లా కలెక్టర్ , రిటర్నింగ్ అధికారి గిరీష్ మిశ్రా ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. స్ట్రాంగ్ రూమ్ నుంచి పోస్టల్ బ్యాలెట్లను ఆయన నవంబర్ 27న బయటకు తీశారని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి మెమోరాండం అందజేశారు. దీంతో జబల్‌పూర్ డివిజనల్ కమిషనర్ ఆదేశాలపై సోనీ సస్పెండ్ అయ్యారు. అంతకు ముందు పోస్టల్ బ్యాలెట్
సంఘటనపై అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, తహసీల్దార్ హిమ్మత్ సింగ్ సస్పెండ్ అయ్యారు.
ఎంపీలో పోలింగ్ అధికారుల సస్పెన్షన్
- Advertisement -
- Advertisement -
- Advertisement -