Wednesday, January 22, 2025

ఎన్నికలలో విషాదం..

- Advertisement -
- Advertisement -

ఆదిలాబాద్ ,పటాన్‌చెరు: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వేర్వేరు సంఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఓటు వేసేందుకు వచ్చిన ఇద్దరు వృద్ధులతోపాటు, ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు వచ్చిన అధికారికి గుండెపోటుతో రావటంతో కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల్లోకి వెళితే… ఆదిలాబాద్ పట్టణంలోని భుక్తాపూర్ కాలనీకి చెందిన చంద్రగిరి రాజన్న (65) సంవత్సరాల వృద్ధుడు స్థానిక గరల్స్ హైస్కూల్లో తన ఓటు వేసేందుకు వచ్చి వరుసలో నిలబడ్డాడు.

ఈ క్రమంలో చంద్రగిరి రాజన్న కళ్ళు తిరిగి కిందపడిపోవటంతో అక్కడున్న సిబ్బంది గమనించి ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే రాజన్న మృతి చెందినట్లు వెల్లడించారు. అదే విధంగా మరో సంఘటనలో స్థానిక మావల కేంద్రంలో ఓటు వేసేందుకు వచ్చిన తోకల గంగమ్మ (78) సంవత్సరాల వృద్ధురాలు అదే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు వచ్చి ఓటు వేసేందుకు వరుసలో నిలబడగా గంగమ్మకు ఫిట్స్ రావడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలింది. దీంతో స్థానికులు స్పందించి వెంటనే రిమ్స్ ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరిశీలించి గంగమ్మ అప్పటికే మృతి చెందిందని తెలిపారు.

ఇస్నాపూర్‌లో గుండెపోటుతో అధికారి మృతి
కొండాపూర్ వెటర్ని విభాగంలో పనిచేస్తున్న సుధాకర్ (48) అసెంబ్లీ ఎన్నికల విధుల్లో భాగంగా సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండల పరిధిలోని ఇస్నాపూర్ పోలింగ్ భూత్ నెంబర్ 248లో విధులు నిర్వహణ కోసం వచ్చాడు. అయితే గురువారం ఉదయం విధుల్లో భాగంగా పోలింగ్ బాక్సులను తనిఖీ చేసే క్రమంలో ఒక్కసారి కుప్పకూలడంతో వెంటనే సిబ్బంది పటాన్‌చెరు ప్రభు త్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్టుగా తెలిపారు. ఎన్నిక విధులు నిర్వహణ కోసం వచ్చిన సహ ఉద్యోగి మృతి చెందడంతో సహ ఉద్యోగులు తీవ్ర విషా దంలో మునిగిపోయారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News