Monday, January 20, 2025

రెండు రాష్ట్రాల్లో ముగిసిన అసెంబ్లీ ఎన్నికలు

- Advertisement -
- Advertisement -

మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ బుధవారం సాయంత్రం 6 గంటలకు ముగిసింది. దీనితో ఎన్‌డిఎ, ఇండియా కూటమి మధ్య హోరాహోరీ ఎన్నికల పోరుకు తెర పడినట్లయింది. ఝార్ఖండ్‌లో రెండవది, తుది విడత పోలింగ్ జరగగా, మహారాష్ట్రలో ఒకే దఫా ఎన్నికలు ముగిశాయి. రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శనివారం (23న) ప్రకటిస్తారు. రెండు రాష్ట్రాల్లో పోలింగ్ ఉదయం 7 గంటలకు మొదలు కాగా, మహారాష్ట్రలో సాయంత్రం 6 గంటలకు, ఝార్ఖండ్‌లో సాయంత్రం 5 గంటలకు ముగిసింది. అప్పటి వరకు జరిగిన పోలింగ్ ప్రకారం, మహారాష్ట్రలో 58.22 శాతం, ఝార్ఖండ్‌లో 67.59 శాతం పోలింగ్ నమోదైంది. అయితే, క్యూలలో నిల్చున్నవారికి వోటింగ్‌కు అవకాశం ఇవ్వడంతో పోలింగ్ శాతం స్వల్పంగా పెరగవచ్చు,

మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగగా, 4136 మంది అభ్యర్థులు పోటీ చేశారు. మహాయుతి కూటమిలో భాగంగా బిజెపి 149, ఏక్‌నాథ్ షిండే శివసేన 81, అజిత్ పవార్ సారథ్యంలోని ఎన్‌సిపి 59 స్థానాల్లో పోటీ చేశాయి. ప్రతిపక్ష మహావికాస్ అఘాడి (ఎంవిఎ)లో కాంగ్రెస్ 101, ఉద్ధవ్ థాక్కరే సారథ్యంలోని శివసేన (యుబిటి) 95, ఎన్‌సిపి (శరద్ పవార్) 86 స్థానాలకు పోటీ చేశాయి. ఇక ఝార్ఖండ్‌లోని 81 అసెంబ్లీ స్థానాలకు గాను ఇండియా కూటమిలోని జెఎంఎం 43, కాంగ్రెస్ 30, ఆర్‌జెడి 6 స్థానాలకు పోటీ చేయగా సిపిఐ (ఎంఎల్) ఒక స్థానానికి అభ్యర్థిని నిలిపింది. బిజెపి 68, ఎజెఎస్‌యు 10, జెడి (యు) 2 సీట్లకు పోటీ చేయగా చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్‌జెపి (ఆర్‌వి) ఒక సీటుకు అభ్యర్థిని నిలిపింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News