Monday, January 20, 2025

ఛత్తీస్‌గఢ్‌లో పోలింగ్ నాడే ఎన్‌కౌంటర్

- Advertisement -
- Advertisement -

కోబ్రా గాలింపు దశలో.. నలుగురు జవాన్లకు గాయాలు

సుక్మా : అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్ జరిగింది. సుక్మా జిల్లాలోని మిన్పా, దూలెద్ గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో నక్సలైట్లతో మంగళవారం జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు భద్రతా బలగాల జవాన్లు గాయపడ్డారు. ఈ ప్రాంతం తొలి విడత పోలింగ్ ఘట్టంలో ఇమిడి ఉంది. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగిందని పోలీసులు తెలిపారు.

చింతాగుఫా పోలీసు స్టేషన్ పరిధిలోకి వచ్చే ప్రాంతంలో కోబ్రాకు చెందిన భద్రతా బలగాల బృందం పోలింగ్ బందోబస్తులో భాగంగా తనిఖీలు జరుపుతూ ఉండగా నక్సల్స్ కాల్పులు జరిపారు. దీనితో జరిగిన పరస్పర కాల్పుల్లో నలుగురు జవాన్లు గాయపడ్డారని పోలీసు అధికారులు వివరించారు. సిఆర్‌పిఎఫ్‌కు అత్యంత సునిశితమైన బెటాలియన్‌గా ఈ కోబ్రా దళం ఉంది. కాగా సుక్మా జిల్లాలోనే తొందమార్కా వద్ద పేలుడులో కోబ్రా బెటాలియన్ ఇన్‌స్పెక్టర్ శ్రీకాంత్ తీవ్రంగా గాయపడ్డారు. నక్సలైట్లు ఈ చర్యకు పాల్పడినట్లు వెల్లడైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News