Wednesday, January 22, 2025

ఓటెత్తారు…

- Advertisement -
- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా 119 నియోజకవర్గాలలో పోలింగ్ ప్రక్రియ గురువారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. కొన్ని సమస్యాత్మక ప్రాంతాలలో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ పూర్తయింది. ఓట్ల పండుగకు ప్రజలు పోటెత్తారు. జీవనోపాధికోసం నగరంలో జీవిస్తున్న ప్రజలు పోలింగ్ కోసం పల్లెబాట పట్టారు. గ్రామీణ ప్రాంతాలలో జనం భారీ సంఖ్యలో తమ ఓటు వినియోగించకున్నారు. కొత్తగా ఓటు హక్కును పొందిన యువత సైతం ఉత్సాహంగా పోలింగ్‌లో పాల్గొంది. శత వసంతాల వృద్ధుల నుంచి సీనియర్ సిటిజన్లు, దివ్యాంగుల వరకు, సినిమా స్టార్ల నుంచి సామాన్య జనం వరకు తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటుకున్నారు. ఆయా ప్రాంతాలలో తమ ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రులు, ఇతర ప్రముఖులు, తొలి ఓటర్లకు సంబంధించిన చిత్రమాలిక…

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News