Wednesday, January 22, 2025

రాష్ట్రపతి ఎన్నిక.. ముగిసిన పోలింగ్

- Advertisement -
- Advertisement -

21న ఉదయం
10.30 గంటలకు ఓట్ల లెక్కింపు
25న కొత్త రాష్ట్రపతి ప్రమాణం

రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ దేశవ్యాప్తంగా స్ఫూర్తిదాయకంగా సాగింది. వ్యాధులు ముసిరినా ఖాతరు చేయకుండా పలువురు నాయకులు పోలింగ్‌లో పాల్గొన్నారు. కరోనా సోకిన కొందరు నాయకులు పిపిఈ కిట్లు ధరించి ఓటు వేశారు. మొత్తంమీద 99.18% పోలింగ్ జరిగింది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ తొలి ఓటు వేశారు.

ఓటు హక్కు వినియోగించుకున్న
ఎంపిలు, ఎంఎల్‌ఎలు

దేశవ్యాప్తంగా 99.18% పోలింగ్ ఓటింగ్‌లో పాల్గొనని ఆరుగురు ఎంపిలు
వీల్‌చైర్‌లో వచ్చి ఓటేసిన మాజీ ప్రధాని పార్లమెంట్ భవనంలో ఓటు
వేసిన 9మంది ఎంఎల్‌ఎలు రాష్ట్రాలలో ఓటు హక్కు వినియోగించుకున్న
45మంది ఎంపిలు పోటీలో ద్రౌపది ముర్ము, యశ్వంత్ సిన్హా

సిఎం కెసిఆర్ సహా
117మంది..

తెలంగాణ భవన్ నుంచి
బస్సులో బయల్దేరిన
టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు
బస్సులోనే అసెంబ్లీకి
మంత్రి కెటిఆర్
కరోనాతో మంత్రి గంగుల
ఓటింగ్‌కు దూరం,
విదేశీ పర్యటనలో
చెన్నమనేని
ఓటింగ్‌లో
అయోమయం

తెలంగాణ భవన్ నుంచి
టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు, మంత్రులతో
కలిసి అసెంబ్లీకి బస్సులో వెళ్లిన
మంత్రి కెటిఆర్
తెలంగాణలో ఇద్దరు…ఎపిలో ఇద్దరు
ఎంఎల్‌ఎలు ఓటింగ్‌కు దూరం
ఓటు వేయలేకపోయిన
మంత్రి గంగుల, చెన్నమనేని

మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రతిష్టాత్మకమైన రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ రాష్ట్రంలో ప్రశాంతంగా ముగిసింది. శాసనసభలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ సహా వివిధ పార్టీలకు చెందిన 117 మంది ఎంఎల్‌ఎలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొవిడ్ పాజిటివ్ వచ్చిన కారణంగా మంత్రి గంగుల కమలాకర్, విదేశాలలో ఉన్న వేములవాడ ఎంఎల్‌ఎ చెన్నమనేని రమేశ్ ఓటు వేయలేకపోయారు. వరంగల్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ వచ్చిన సిఎం కెసిఆర్ నేరుగా శాసనసభకు వచ్చి ఓటు వేశారు. ముఖ్యమంత్రి ఓటే వేసే సమయంలో శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి, ఉప సభాపతి పద్మారావు గౌడ్, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రశాంశ్‌రెడ్డిలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఉదయం 10 గంటలకు పోలింగ్ ప్రారంభం

రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ఉదయం 10 గంటలకు నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిగింది. టిఆర్‌ఎస్ పార్టీ ఆదేశాల మేరకు.. మంత్రులు, టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు అందరూ ఉదయం 8 గంటలకు తెలంగాణ భవన్ చేరుకున్నారు. ఓటింగ్‌లో పొరపాట్లకు అవకాశం ఉండకూడదన్న ఉద్దేశంతో తెలంగాణ భవన్‌లో టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలకు మాక్ పోలింగ్ నిర్వహించారు. పోలింగ్ నిబంధనలు, ఓటింగ్ తీరుపై మంత్రులు, ఎంఎల్‌ఎలకు కెటిఆర్ వివరించారు. విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా కు అందరూ ఓటు వేయాలని పార్టీ ఎంఎల్‌ఎలకు కేటీఆర్ సూచించారు. అనంతరం తెలంగాణ భవన్ నుంచి పలువురు మంత్రులు, ఎంఎల్‌ఎలతో కలిసి మంత్రి కెటిఆర్ బస్సులో అసెంబ్లీకి వెళ్లారు. మొదట కెటిఆర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం మంత్రులు హరీశ్‌రావు,జగదీశ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, మహమూద్ అలీ, మల్లారెడ్డి అసెంబ్లీకి వచ్చి ఓటు వేశారు. శ్రీనివాస్‌గౌడ్, పువ్వాడ అజయ్‌కుమార్,ఇంద్రకరణ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వ ర్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాఠోడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ శాసనసభలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆ తర్వాత పలువురు ఎంఎల్‌ఎ ఓటు వేశారు.

ఓటు విలువ 132

రాష్ట్రంలో బిజెపి, కాంగ్రెస్, మజ్లిస్ పార్టీల ఎంఎల్‌ఎలు శాసనసభకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల సంఘం ప్రత్యేక అనుమతితో ఆంధ్రప్రదేశ్‌లోని కందుకూరు ఎంఎల్‌ఎ మహీధర్‌రెడ్డి, రాష్ట్ర శాసనసభలో ఓటు వేశారు. ఈ ఎన్నికల్లో రాష్ట్ర శాసనసభ్యుల ఓటు విలువ 132. మొత్తం 119 మందికి చెందిన ఓట్ల విలువ 15,708గా ఎన్నికల సంఘం నిర్ణయించింది. ప్రత్యేక భద్రత నడుమ పోలింగ్ బాక్సును దిల్లీకి పం పారు. 21న రాష్ట్రపతి ఎన్నికల ఫలితాల వెల్లడిస్తారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News