Friday, December 20, 2024

మహారాష్ట్ర, జార్ఖండ్ లలో కొనసాగుతున్న పోలింగ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ కొనసాగుతోంది. బాలీవుడ్ ప్రముఖులు అబ్రహమ్, జోయా అక్తర్, అలీ ఫజల్,  మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కుర్ తన కుటుంబంతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. గురువారం మహారాష్ట్రలోని 288 నియోజకవర్గాల్లో ఒకే విడతలో, జార్ఖండ్ రెండో దశ పోలింగ్‌లో భాగంగా 38 స్థానాల్లో పోలింగ్‌ జరుగుతోంది. రెండు రాష్ట్రాల్లోని సమస్యాత్మక, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 4 గంటలకే పోలింగ్ ముగియనుంది. జార్ఖండ్‌లో రెండో దశ పోలింగ్‌లో మొత్తం 528మంది బరిలో ఉన్నారు. వీరిలో సిఎం హేమంత్ సోరెన్‌తో పాటు ఆయన భార్య కల్పన సోరెన్ ప్రముఖుల్లో ఉన్నారు.

విపక్ష నేత అమర్ కుమార్ బౌరి కూడా పోటీలో ఉన్నారు.  మహారాష్ట్రలో ప్రధానంగా బిజెపి నేతృత్వంలోని అధికార మహాయుతి, కాంగ్రెస్, ఎన్‌సిపి, శివసేన(ఉద్ధవ్) తదితర పక్షాలతో కూడిన మహావికాస్ అగాఢీ కూటముల మధ్య పోరు హోరాహోరీగా సాగనుంది. జార్ఖండ్‌లో 31 పోలింగ్ స్టేషన్‌లలో 4గంటలకే పోలింగ్ ముగియనుంది. మిగతా చోట్ల సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ వినియోగించుకోవచ్చు. మరోవైపు రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఈ నెల 23న వెలువడనున్నాయి. ఓటింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు వెలువడుతాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News