- Advertisement -
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ జరుగుతోంది. ఏడు జిల్లాలోని 24 నియోజకవర్గాలలో 11 గంటల వరకు 26.72 శాతం పోలింగ్ నమోదైంది. తొలి విడతలో 23 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగింకోనున్నారు. ఓటర్లలో 5.66 లక్షల మంది యువత తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికల్లో బిజెపి, నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమోక్రటికి పార్టీలు పోటీచేస్తున్నాయి. కానీ నేషనల్ కాన్ఫరెన్స్‌తో కాంగ్రెస్ జత కట్టి బరిలోకి దిగింది. జమ్ము కశ్మీర్ ఎన్నికలు మూడ విడుతలలో జరగనున్నాయి.
- Advertisement -