Sunday, December 22, 2024

ప్రజలకు అందుబాటులో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట:పోలింగ్ స్టేషన్స్ రేషనలైజేషన్ ప్రక్రియ పై జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావ్ అదనపు కలెక్టర్లు, ఆర్డిఓలు నాలుగు నియోజకవర్గాల తహశీల్దార్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు.

ఏర్పట్ల నివేదికలను సమర్పించాలన్నారు. గతంలో ఉన్న పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల సంఖ్యను పరిగణలోకి తీసుకుని అవసరమైతే అదనపు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచిచారు. రాబోవు ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించిన ముఖ్యమైన అంశాల పై కలెక్టర్ అధికారులతో చర్చించారు.

ఎన్నికల కమిషన్ జారీ చేసిన నిబంధనలు పాటిస్తూ పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లు పకడ్బంధీగా ఉండాలన్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు వెంకట్ రెడ్డి, ప్రియాంక, ఆర్డిఓలు చారి, జగదీశ్వర్ రెడ్డి, సూర్యానాయణ, నాలుగు నియోజకవర్గాల తహశీల్దార్లు జయశ్రీ, వెంకన్న, రాంప్రసాద్, శ్రీనివాస్ శర్మ, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News